పదేళ్ల అనంతరం టీడీపీ బడ్జెట్

20 Aug, 2014 11:37 IST|Sakshi

హైదరాబాద్ : పదేళ్ల అనంతరం టీడీపీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి బడ్జెట్ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. పదేళ్ల తర్వాత టీడీపీ హయాంలో మొదటి బడ్జెట్ ఇదే. తొలి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రావడం అదృష్టమని యనమల అన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మొత్తం బడ్జెట్ రూ.1,11,824 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నామన్నారు.

 

మరిన్ని వార్తలు