సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన అజేయ కల్లం

5 Jun, 2019 10:22 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ్‌ కల్లం మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా అజేయ కల్లం కేబినెట్‌ హోదాతో సీఎం ముఖ్య సలహాదారుగా నియమితులయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. 

అజేయ కల్లం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎం పేషీ) అధిపతిగా వ్యవహరిస్తారు. అలాగే సీఎంవో కార్యదర్శులకు శాఖల కేటాయింపు బాధ్యతతో పాటు రాష్ట్రంలో ఏ శాఖకు చెందిన అధికారినైనా పిలిచి సలహాలు ఇచ్చే అధికారాన్ని ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో ఆయన టీటీడీ కార్యనిర్వహణ అధికారిగా, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు.

మరిన్ని వార్తలు