'సమైక్య శంఖారావం' వల్లే మళ్లీ అఖిలపక్ష భేటీ

1 Nov, 2013 14:40 IST|Sakshi

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమైక్య శంఖారావం బహిరంగ సభ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడిందని మాజీ ఐఏఎస్ అధికారి, ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు తోట చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.శుక్రవారం ఆయన ఏలూరులో విలేకర్లతో మాట్లాడుతూ... అందువల్లే కేంద్రం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

 

వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు కోర్టు అనుమతించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్కు పెరుగుతున్న జనాదరణ చూసి... వైఎస్ విజయమ్మ పర్యటనను తెలంగాణవాదులు అడ్డుకున్నారని తోట చంద్రశేఖర్ ఆరోపించారు. గత నెల 26న సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభకు సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో ఆ సభకు హజరై విజయవంతం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు