అన్ని పథకాలకూ ఇక ఆధార్

10 Aug, 2014 02:43 IST|Sakshi
అన్ని పథకాలకూ ఇక ఆధార్

విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు చేయించుకోవాల్సిందేనని కలెక్టర్ ఎంఎం నాయక్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరె న్స్ హాల్‌లో ఆధార్ సీడింగ్, నమోదుతో సంబంధమున్న అన్ని శాఖల అధికారులతో ఆయన శనివారం సమీక్షించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అన్నిరకాల పథకాల కు ఆధార్‌తో అనుసంధానం చేసే యోచనతో ప్రభుత్వం ఉందన్నారు. ఈ క్రమంలో ఆధార్ ప్రక్రియను వేగవంతం చేయూలన్నారు. ఇందుకోసం జిల్లాలో ఉన్న 36 కేంద్రాలతో పాటు మరో వంద కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇవి కొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. సెప్టెంబరు నెలాఖరు నాటికి జిల్లాలో ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తి చేయూలని అధికారులను ఆదేశించారు.
 
 ఈ సందర్భంగా శాఖల వారీగా ఆధార్ నమో దు, సీడింగ్‌లపై సమీక్షించారు. జిల్లాలో సోమవారం నుంచి తొలుత 25 కేంద్రాలు ప్రారంభమవుతాయన్నారు. మిగిలిన కేంద్రాలు ఈ నెల 14లోగా ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో సుమారు మూడు లక్షల మంది ఆధార్ నమోదు చేసుకోవాల్సి ఉన్నట్టు గుర్తించామన్నారు. వంద కేంద్రాల్లో ఒక్కో కేంద్రంలో రోజుకు 60 మంది చొప్పున ఆధార్ నమోదు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాల న్నారు. ఆయూ శాఖల్లో పనిచేస్తున్న క్షేత్ర స్థాయి సిబ్బంది సేవలను సైతం తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పింఛన్లు, జాబ్ కార్డులు, స్కాలర్‌షిప్పులు, గృహాలు, గ్యాస్ మంజూరు తదితర అన్ని సేవలకు ఆధార్ నంబరు ప్రామాణికం కావాలన్నారు. అన్ని శాఖల సిబ్బంది మొదటి ప్రాధాన్యతను ఆధార్ నమోదు, సీడింగ్‌కు ఇవ్వాలన్నారు. గతంలో పొందిన ఈఐడీలను కూడా సీడింగ్ చేయూలన్నారు.
 
 ఆధార్ నమోదు కు అవసరమైన ఫారాలను సిద్ధంగా ఉంచాల న్నారు. గృహ నిర్మాణ శాఖలో అతి తక్కువ ఆధార్ నమోదు శాతం ఉందని, కారణమేమిట ని పీడీ కుమార్‌ను ప్రశ్నించారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది రావడం లేదని పీడీ చెప్పారు. త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పగా... చేస్తాం.. చూస్తామంటే కుదరదని నిర్ణీత సమయంలోగా పూర్తి చేయూలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ బి.రామారా వు, సబ్ కలెక్టర్ శ్వేతామహంతి, ఆర్‌డీఓ వెంకటరావు, డీఎస్‌ఓ హెచ్‌వీ ప్రసాదరావు, మీ సేవ కోఆర్డినేటర్ శ్రీలత, డీఆర్‌డీఏ పీడీ టి.జ్యోతి, డ్వామా పీడీ గోవిందరాజులు, ఎస్సీ కార్పొరేష న్ ఈడీ కేవీ ఆదిత్యలక్ష్మి, మీ సేవ ఈడీఏ శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు