అన్ని బీసీ హాస్టళ్లలో స్వచ్ఛ కార్యక్రమం

18 May, 2015 17:41 IST|Sakshi

గోల్నాక (హైదరాబాద్) : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలల బీసీ హాస్టళ్లలో స్వచ్ఛ కార్యక్రమాన్ని విద్యార్థుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ డెరైక్టర్ కె.అలోక్‌కుమార్ అన్నారు. సోమవారం అంబర్‌పేటలోని బీసీ కళాశాల హాస్టల్‌లో జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలోని పది జిల్లాల్లో 250 బీసీ హాస్టళ్లు ఉన్నాయని, ఆయా కళాశాలల్లో విద్యార్థుల పరీక్షల షెడ్యూల్‌ను అనుసరించి వారికి వీలైన సమయంలో ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. బీసీ సంక్షేమశాఖ ఉద్యోగులు, విద్యార్థులంతా ఇందులో పాల్గొనాలని ఈ సందర్భంగా  పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు