విశాఖపట్నం-హౌరా రైళ్లు రద్దు

13 Oct, 2013 12:18 IST|Sakshi

ఫైలిన్ తుపాన్ ప్రభావం రైళ్ల సర్వీసులపై రెండో రోజూ ప్రభావం చూపుతోంది. ఆదివారం విశాఖపట్నం, హౌరా మధ్య నడిచే అన్ని రైళ్లను ఆపివేశారు. శనివారం కూడా చాలా రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తపాన్ ధాటికి రైల్వే ట్రాక్లు దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ మధ్య , తూర్పు రైల్వే ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ సర్వీసులతో కలిపి 70కి పైగా రైళ్లను రద్దు చేశాయి. వీటిలో విశాఖపట్నం, పూరి, భువనేశ్వర్ మధ్య ప్రయాణించాల్సిన రైళ్లు కూడా ఉన్నాయి.

తుపాన్ ప్రభావం ఒడిషా తీర ప్రాంత జిల్లాల్లో అధికంగా ఉండగా, రాష్ట్రంలో శ్రీకాకుళం మినహా ఇతర జిల్లాల్లో కాస్త తక్కువగా ఉంది. అధికారులు వాతావరణ పరిస్థితుల్ని, ట్రాక్లను పరిశీలించి రైళ్లను మళ్లీ ఎప్పటి నుంచి పునరుద్ధరిస్తారన్న విషయాన్ని నిర్ణయించనున్నారు.

మరిన్ని వార్తలు