స్టార్‌హోటళ్లల్లో సమావేశాలు పెట్టొద్దు

30 Jul, 2014 15:41 IST|Sakshi
స్టార్‌హోటళ్లల్లో సమావేశాలు పెట్టొద్దు

హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో లోటు బడ్జెట్ ఉండడంతో ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ శాఖలు ఖర్చులు తగ్గించుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకంపై నియంత్రణ పాటించాలని సూచించింది. స్టార్‌హోటళ్లల్లో సమావేశాలు నిర్వహించొద్దని కోరింది.

ప్రభుత్వ శాఖలన్నీ ఆదాయం పెంచుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం విధించింది. అద్దె వాహనాల వినియోగాన్ని తగ్గించాలని సూచించింది. మంత్రులు, ఉన్నతాధికారులు సాధారణ క్లాస్‌లోనే ప్రయాణించాలని విజ్ఞప్తి చేసింది.

కాగా, మంత్రులు, ఎమ్మెల్యేలు దుబారాపై ప్రభుత్వం స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు తన తాత్కాలిక ఛాంబర్ కోసం రూ. లక్షలు వెచ్చించారు. ఇటీవల ఏపీ ఎమ్మెల్యేలకు రెండు రోజుల పాటు ఓ స్టార్ హోటల్ శిక్షణా తరగతుల నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఎంత ఆర్భాంగా నిర్వహించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరిన్ని వార్తలు