ఏపీ స్వాతంత్య్ర దినోత్సవాల ఖర్చు రూ. 5 కోట్లు

30 Jul, 2014 03:18 IST|Sakshi

కొత్త రాజధాని ఏర్పడే వరకు కర్నూలులోనే స్వాతంత్య్ర, రిపబ్లిక్‌డే వేడుకలు
 కర్నూలు: రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు నగరంలో తొలిసారిగా ఆగస్టు 15వ తేదీన నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకలకు ప్రభుత్వం రూ. 5 కోట్లు ఖర్చు చేస్తోంది. ఏర్పాట్లు స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్ (ఎస్‌ఏపీ) క్యాంప్ మైదానంలో చురుగ్గా సాగుతున్నాయి.  ఏర్పాట్లను ఆగస్టు 5వ తేదీలోగా పూర్తి చేయాలనే పట్టుదలతో అధికార యంత్రాంగం ఉంది. రోడ్లు, భవనాల శాఖ, మున్సిపాలిటీ, సమాచార, తదితర శాఖల ద్వారా చేపట్టనున్న ఏర్పాట్లకు రూ. 3.50 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పోలీసు, ఇతర శాఖల ద్వారా మరో రూ. 1.50 కోట్లకు పైగా వ్యయం చేయనున్నారు. ఏర్పాట్లను సమీక్షించేందుకు ఆగస్టు 2న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతోపాటు పలువురు  సీనియర్ అధికారులు రానున్నారు. 13 జిల్లాల నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పడేంత వరకు కర్నూలులోనే స్వాతంత్య్ర, రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహించనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు