జాబులేవి బాబూ..?

8 Nov, 2017 09:12 IST|Sakshi

జిల్లాలో మూడేళ్లలో డిగ్రీ పూర్తి చేసిన వారు (ఇంజినీరింగ్‌ సహా) 2,00,000

లక్షల్లో నిరుద్యోగులు 

ఉపాధి కోసం వలసలు

పాలకొల్లు టౌన్‌: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటికొక ఉద్యోగం కల్పిస్తాం. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగులకు నెలనెలా భృతి కల్పిస్తాం... 2014 ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు చెప్పిన మాటలివి. ఎన్నికలు అయిపోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడిచింది. కానీ ఇచ్చిన హామీ మాత్రం అమలుకాలేదు. నిరుద్యోగులు లక్షల్లో ఉన్నా ఉపాధి లేదు. కనీసం భృతి కూడా ఇవ్వడం లేదు. దీంతో డిగ్రీలు, ఇంజినీరింగ్‌ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జిల్లా ఉపాధి కార్యాలయం (ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛేంజ్‌)లో 2014 నుంచి ఇప్పటి వరకు 71,164 మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రతి ఏడాది జిల్లాలో వేలాది మంది డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదివిన విద్యార్థులు పట్టభద్రులై బయటకు వస్తున్నారు. 

వారంతా ఉద్యోగాలు దొరక్క పోషణ కోసం ఏదో ఒక పని చేయాల్సి వస్తోంది. జిల్లాలో 110 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల నుంచి ప్రతి ఏటా పట్టభద్రులైన సుమారు 50వేల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు. అదే విధంగా జిల్లాలో ప్రస్తుతం 36 ఇంజనీరింగ్‌ కళా శాలల నుంచి ఏటా సుమారు 16 వేల మంది విద్యార్థులు పట్టాలు చేతపట్టి ఉద్యోగాల కోసం బయటకు వస్తున్నారు. దీంతో పాటు పాలిటెక్నికల్, ఐటీఐ, ఇతర సాంకేతిక కోర్సులకు సంబం ధించి 10వేల మంది విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నట్లు కళాశాలల ప్రిన్సిపల్స్‌ చెబుతున్నారు. ఈ లెక్కల ప్రకారం ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో డిగ్రీ పూర్తి చేసి బయటకు వస్తున్న విద్యార్థులు ఏటా 66 వేల మంది ఉంటున్నారు. గడచిన మూడేళ్లలో లెక్కిస్తే ఇంచుమించు రెండు లక్షలు మంది డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని కాలేజీల నుంచి బయటకు వచ్చారన్నమాట. 

ఉపాధికల్పనా కార్యాలయంలో ఈ మూడేళ్లలో ఉద్యోగం కోసం పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య 71,164. ఇందులో కొందరు ఇంటర్, పాలిటెక్నిక్‌ కోర్సులు పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు. ఇందులో డిగ్రీ పూర్తిచేసిన వారు 50 వేల మంది ఉన్నారనుకున్నా ఇంకా లక్షన్నర మంది డిగ్రీ చదివి ఉపాధి లేక సతమతమవుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఇదిలాఉండగా డిగ్రీ చదివిన విద్యార్థులు రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లి అరకొర జీతాలతో పనిచేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ప్రతి ఏటా ఉద్యోగాల కోసం హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, ముంబై వలస వెళుతున్నవారు వేలల్లోనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వారిలో చాలామంది ఆయా చోట్ల కేవలం రూ.10 వేల నెలవారీ జీతాలకే ఉద్యోగాలు చేస్తున్నారని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు చేట్టాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు.

పైపులైన్‌ అసాధ్యం
తుందుర్రులోని గోదావరి మెగా ఆక్వాఫుడ్‌పార్కు నుంచి సుమారు 26.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా జిల్లాలోని గొల్లపాలెం వరకు పైపులైన్‌ వేయడం అసాధ్యంతో కూడుకున్నది. తాగునీరు ప్రజలకు అందించేందుకు వేసే కిలోమీటరు పొడవున పైపులైన్‌లే పగిలిపోయి కలుషితమవుతున్నాయి. 29 కిలోమీటర్లు పైపులైన్‌ వేసి సముద్రంలో కలపడమంటే అసాధ్యం.
– ఆరేటి వాసు, గోదావరి మెగా ఫుడ్‌పార్కు పోరాట కన్వీనర్, తుందుర్రు

ప్రజలను మభ్య పెట్టేందుకే 
మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయి. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు చంద్రబాబు ఎత్తుగడ ఇది. ఇక్కడ ప్రజలందరూ మూడేళ్లకు పైగా పోరాటం చేస్తుంటే ఎందుకు ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ఆపలేదు. మీ మోసాలకు మోసపోయేది ఎవరూ లేరు. మా పిల్లల భవిష్యత్తు కోసం మా ప్రాణాలను అర్పిస్తాం.
– బెల్లపు సత్తిబాబు, పోరాటకమిటీ నాయకుడు, కంసాలి బేతపూడి

ఇన్ని చేసే బదులు ఫ్యాక్టరీని తరలించవచ్చు కదా
మూడేళ్లుగా పోరాటం చేస్తున్నాం. ఫ్యాక్టరీ శంకుస్థాపన నుంచి ఉద్యమం చేస్తున్నాం. ఫ్యాక్టరీని ఆదిలోనే తరలించవచ్చు. ఎవరైనా మూడు పంటలు పండే పొలాలు ఉన్నచోట కలుషితమైన ఫ్యాక్టరీని నిర్మిస్తారా. పైపులైన్‌ అన్నది కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు తెరపైకి తీసుకువచ్చిన ప్రయత్నం.
– జవ్వాది వెంకటరమణ, ఎంపీటీసీ, తుందురు

మరిన్ని వార్తలు