'హైదరాబాద్ను ప్రపంచ చిత్రపటంలో నిలిపాం'

4 Nov, 2014 12:56 IST|Sakshi
'హైదరాబాద్ను ప్రపంచ చిత్రపటంలో నిలిపాం'

బెంగళూరు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదం చాలా చిన్న సమస్య అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే ఒకరికొకరు సహకరించుకోవాలని అభిప్రాయపడ్డారు. ఏ రాష్ట్రమైనా పొరుగు రాష్ట్రాలతో మంచి సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలని ఆకాంక్షించారు. మంగళవారం బెంగళూరు వచ్చిన ఆయన న్యూటనిక్స్ ఐటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.... నవ్యాంధ్రలో పరిశ్రమలు, ఐటీ సంస్థల విస్తృతికి మంచి అవకాశాలున్నాయని అన్నారు.

హైదరాబాద్ను అంతర్జాతీయ చిత్రపటంలో నిలిపామని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాగే నవ్యాంధ్రలోని కూడా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని విజయవాడ అద్భుత నగరం, తిరుపతి ఆధ్యాత్మిక నగరమని చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో క్లౌడ్ కంప్యూటరింగ్ ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పుకు నాంది అని అన్నారు. ఇటీ సాయంతో సంక్షేమ పథకాల అమలులో అనర్హులను ఏరివేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు