ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ రేసులో ఆ ముగ్గురు..!

29 Mar, 2019 18:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: హైకోర్టు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో నూతన ఇంటెలిజెన్స్‌  నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని కోసం ముగ్గురు సీనియర్‌ అధికారులు పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించారు. ఈ మేరకు  ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎస్‌ పంపారు.  సీఎస్‌ పంపిన జాబితాలో నళినీ ప్రభాత్‌ (1992 బ్యాచ్‌), కుమార్‌ విశ్వజిత్‌, కృపానంద త్రిపాఠి ఉజెలా (1994) ఉన్నారు.

వీరిపై ఎలాంటి శాఖాపరమైన విచారణలు పెండింగ్‌లో లేవని స్పష్టం చేశారు. ఏపీలో అధికార టీడీపీ సేవలో తరిస్తూ, విధి నిర్వహణలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం విదితమే. ఆయనతోపాటు వైఎస్సార్, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్‌దేవ్‌ శర్మ, వెంకటరత్నంలను కూడా బదిలీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రంలో పలువురు పోలీసు అధికారులు పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పలుమార్లు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

చదవండి: ఇంటెలిజెన్స్‌ డీజీపై వేటు


 

మరిన్ని వార్తలు