ఐటీ శాఖ కార్యదర్శిగా భాను ప్రకాష్‌

10 Jul, 2020 21:42 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఐటీ శాఖ కార్యదర్శిగా వై భాను ప్రకాష్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.  మరోవైపు కరోనా ఆస్పత్రులను పర్యవేక్షించేందుకు స్పెషల్ ఆఫీసర్‌గా రాజమౌళిని ప్రభుత్వం నియమించింది. కరోనా ఆస్పత్రుల సామర్థ్యం, సన్నద్ధత పర్యవేక్షణ తదితర బాధ్యతలను రాజమౌళి పర్యవేక్షించనున్నారు. దేశంలో కరోనా ‌ టెస్ట్‌లను అత్యధికంగా నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రపదేశ్‌ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. శుక్ర‌వారం రాష్ట్రంలో కొత్త‌గా 1608 క‌రోనా పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 24 గంట‌ల్లో 21,020 శాంపిల్స్‌ను ప‌రిక్షించగా అందులో 1576 కేసులు ఏపీలో న‌మోద‌వ్వ‌గా, మిగ‌తా 32 క‌రోనా కేసులు ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చినవారివి ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసులు సంఖ్య 25,422కి చేరింది.

మరిన్ని వార్తలు