జీవీఎంసీ అధికారులతో మంత్రుల సమీక్షా సమావేశం

9 Oct, 2019 18:41 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఇసుక కొరతకు సంబంధించి మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జీవీఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అవంతీ శ్రీనివాస్‌, ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ, ఎమ్మెల్యే గుడివా అమర్‌నాథ్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు యుద్ద ప్రాదిపదికన జీవీఎంసీలోని రోడ్లు, కాల్వలు, శ్మశాన వాటికల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి బొత్స అధికారులను ఆదేశించారు. మరో నెల రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ పర్యటన నేపథ్యంలో జీవీఎంసీ పరిధిలో మూడు వేల కోట్ల పనులకు ప్రారంభోత్సవాలకు సిద్దం చేయనున్నట్లు మరో మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. దీపావళి నాటికి విశాఖలో ఇసుకకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని, అందుకోసం డెంకాడలో ఇసుక రీచ్‌ కేటాయింపులు జరపాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా గోదావరి బోటు ప్రమాదంలో మృతి చెందిన బూసర్ల లక్ష్మి కుటుంబానికి మంత్రులు బొత్స, అవంతీలు పది లక్షల నష్ట పరిహారం అందించారు.

బోటు బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం
బోటు ప్రమాదంలో మృతి చెందిన తిరుపతి వాసుల కుటుంబీకులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసింది. తిరుపతికి చెందిన సుబ్రమణ్యంతో పాటు ఆయన కుమార్తె, కుమారుడు చనిపోయారు. ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి సుబ్రమణ్యం భార్య మాధవి లతకు 15 లక్షల రూపాయల చెక్ను అందజేశారు. బోటు ప్రమాదం లో సుబ్రమణ్యం తో పాటు ఆయన ఇద్దరు బిడ్డలు చనిపోవడం చాలా బాధాకరమని కరుణాకర్ రెడ్డి అన్నారు. సుబ్రమణ్యం కుటుంబీకులకు భవిష్యత్తులో  కూడా ప్రభుత్వం  అండగా ఉంటుందని కరుణాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు