దేవాలయాలకు చైర్మన్లుగా రాజకీయ నిరుద్యోగులా?

13 Oct, 2017 03:45 IST|Sakshi

విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి

పెందుర్తి: టీటీడీ, దేవాదాయ, ధర్మాదాయ శాఖలు వ్యాపార కేంద్రాలుగా మారిపో యాయని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ధ్వజమెత్తారు. ప్రభుత్వం రాజకీయ నిరు ద్యోగులను దేవాలయాలకు చైర్మన్లను చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడ లోని శారదాపీఠంలో ఎంపీ టి.సుబ్బరామి రెడ్డి సౌజన్యంతో తలపెట్టిన అతిరుద్ర, మహా చండీయాగానికి గురువారం స్వామీ జీ అంకురార్పణ చేశారు.

ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తూ దేశ శ్రేయస్సును కాంక్షించి ఈ మహా క్రతువులను తలపెట్టా మన్నారు. అరాచకాలు పెరిగిపోతున్నా ప్రభుత్వాలకు కనువిప్పు కలగడం లేదని ఆక్షేపించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆస్తులను 33 ఏళ్లు, 99 ఏళ్లు అని లీజులకు ఇవ్వడం శోచనీయ మన్నారు. ఐదేళ్లు పదవిలోఉండే రాజకీయ నాయకులకు ఆ భూములపై పెత్తనం ఏమిటని.. ఆ భూములేమైనా వారి అబ్బ సొత్తా? అని ఘాటుగా ప్రశ్నించారు.   యాగకర్త టి.సుబ్బరామిరెడ్డి, ఉత్తర పీఠాధి పతి బాలస్వామి, భక్తులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు