‘ఆంధ్ర’ పదంపై అంత ద్వేషమెందుకు?

3 Sep, 2019 11:18 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న బీవీఎస్‌ మూర్తి

విలీనం తరువాత ఆంధ్రాబ్యాంక్‌ పేరు కనపడదా?

కవులు, కళాకారుల నిరసన గళం

సాక్షి, రాజమహేంద్రవరం: ‘స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో కన్ను తెరచి, విజయపథంలో నడుస్తున్న ఆంధ్రుల బ్యాంక్‌ త్వరలో జరగనున్న విలీనం తరువాత ‘ఆంధ్ర’ శబ్దం కోల్పోవడం దురదృష్టకరం. విలీనం తరువాత కూడా ఆంధ్రాబ్యాంక్‌ పేరే కొనసాగాలి’ అని కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్‌ బీవీఎస్‌ మూర్తి కోరారు. కళాగౌతమి ఆధ్వర్యాన ధాన్యంపాకలు ప్రాథమిక పాఠశాలలో ఆదివారం జరిగిన చర్చావేదికలో కవులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీవీఎస్‌ మూర్తి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆంధ్రుల కోడలని, పేరులో ‘ఆంధ్ర’ శబ్దం తీసివేయడం ఆంధ్రుల అస్తిత్వానికే మచ్చని పేర్కొన్నారు.

‘ఆంధ్రత్వ మాంధ్రభాషా చ–అపి ఆంధ్రదేశ స్వజన్మభూః–తత్ర యాజుషీశాఖానాల్పస్య తపః ఫలమ్‌’ అని తమిళుడైన అప్పయ్య దీక్షితులు అన్నారని, అంటూ, ‘అల్పతపస్సు చేసిన నాబోంట్లకు ఆంధ్రత్వం ఎలా కలుగుతుంద’ని ఈ శ్లోకంలో ఆవేదన వ్యక్తం చేశారని వివరించారు. మహాకవి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి నివసించిన కుటీరానికి ‘ఆంధ్రకుటీరం’ అని, నడిపిన పత్రికకు ‘ఆంధ్రి’ అని, రచనలకు ‘ఆంధ్రపురాణం’ ‘ఆంధ్ర రచయితలు’ అని పేరు పెట్టుకున్నారని చెప్పారు. విలీనంలోని మంచిచెడ్డలపై తాము వ్యాఖ్యానించడం లేదన్నారు. తెలుగు సారస్వత పరిషత్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ పీవీబీ సంజీవరావు మాట్లాడుతూ, ప్రాచీన భాషల అధ్యయన కేంద్రాన్ని నెల్లూరుకు తరలిస్తున్నారని ఆవేదన చెందారు.

ఆంధ్ర మహాభారతం పుట్టిన గడ్డ, తెలుగువారి సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం పేరు పాలకులకు గుర్తుకు రాకపోవడం బాధాకరమని అన్నారు. నటరాజ నృత్యనికేతన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ సప్పా దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ, తెలుగువారంటే కేంద్రానికి చిన్నచూపు, లోకువ అని విమర్శించారు. ఫిలాంత్రఫిక్‌ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజా అద్దంకి యోనా మాట్లాడుతూ, విలీనం తరువాత ఏర్పడే బ్యాంక్‌కు ఆంధ్రాబ్యాంక్‌ పేరునే ఖరారు చేయాలని కోరారు. వైఎస్సార్‌ సీపీ మాజీ కార్పొరేటర్‌ పిల్లి నిర్మల మాట్లాడుతూ, కేంద్రం దిద్దుబాటు చర్య తీసుకునే విధంగా ఒత్తిడి చేయాలన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు ముంగండ సూర్యనారాయణ, లక్కోజు వీరవెంకట సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పయ్యావుల వర్గీయుల రౌడీయిజం..

హోటల్‌ పేరుకు ‘దారి’ చూపింది

నింగికేగిన సామీ.. నిను మరువదు ఈ భూమి..

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేశా: జబర్దస్త్‌ ఫేం అభి

మద్యం షాపు మాకొద్దు..!

ఈ నెల 5 నుంచి ‘రాజన్న ప్రజాదర్బార్‌’

రెండో రోజు గ్రామ, వార్డు సచివాలయ రాత పరీక్షలు

అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రోత్సాహం

మా షాపుకు వస్తే మట్టి గణపతి ఇస్తాం

సంక్షేమ సంతకం.. చెరగని జ్ఞాపకం..

పోలీసమ్మా... మనసు చల్లనమ్మా..

రాత్రి 9 గంటలకు మద్యం దుకాణం కట్టేయాల్సిందే

ఏపీ సెట్‌ దరఖాస్తుకు ఈ నెల 11 తుది గడువు

చికెన్‌ వంటకం..వాంతులతో కలకలం

బాల భీముడు

ప్రకాశం బ్యారేజ్‌ గేట్లు ఎత్తివేత

బంగాళాఖాతంలో అల్పపీడనం

మహానేతకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ నివాళి

ఈనాటి ముఖ్యాంశాలు

అయ్యన్న మతితప్పి మాట్లాడుతున్నారు..

మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌

వైఎస్సార్‌ ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశారు

టీడీపీ నేతల వ్యాఖ్యలు.. దళిత ఎమ్మెల్యే కంటతడి

కొబ్బరి రైతులకు శుభవార్త

విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మహానేతకు నివాళి

‘పేదల అభ్యున్నతికి పాటుపడ్డ గొప్ప వ్యక్తి’

‘మూడు నెలల పాలనను ప్రశ్నించడం హాస్యాస్పదం’

ఆ ఘనత మహానేత వైఎస్సార్‌దే..

పులివెందుల అభివృద్ధిపై సీఎం జగన్‌ సమీక్ష

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేశా: జబర్దస్త్‌ ఫేం అభి

రాజుగారి గది 3 ఫస్ట్ లుక్‌ లాంచ్‌ చేసిన వినాయక్‌

ద‌స‌రా బ‌రిలో ‘చాణ‌క్య’

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

సాహోపై కేటీఆర్‌ కామెంట్‌

ఆమె ఎవరన్నది కనుక్కోలేక పోతున్నారా!