కాపుల మీద దాడులపై పవన్‌ నోరు విప్పాలి

29 Oct, 2023 05:14 IST|Sakshi

మంత్రి అంబటిపై దాడిని ఖండిస్తూ విజయవాడ, రాజమహేంద్రవరంలో నిరసనలు

భవానీపురం(విజయవాడపశ్చిమ)­/రాజ­మ­హేంద్రవరం సిటీ: కాపు సామా­జిక­వర్గంపై దాడులు జరుగుతుంటే పవన్‌కళ్యాణ్‌ ఎందుకు నోరు మెద­పడం లేదని వైఎ­స్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్య­క్షుడు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. కాపుల­పై పవన్‌­కు ప్రేమ ఉంటే మంత్రి అంబటిపై దాడిని ఖండించాలని డిమాండ్‌ చేశారు.

మంత్రి అంబటిపై దాడిని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ కాపు సామాజి­క­­వర్గం ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. వెలంపల్లి మాట్లాడుతూ బలహీనంగా ఉన్న టీడీపీని బతికించాలనుకోవడం పవన్‌ అవివేకమ­న్నారు. సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషగిరి మాట్లాడుతూ అంబటిపై దాడిని ఖండించారు. నగర మేయర్‌ రాయన భాగ్య­లక్ష్మి నేతలు పాల్గొన్నారు.

రాజమహేంద్రవరంలో కాపు జేఏసీ  ర్యాలీ 
మంత్రి అంబటిపై దాడి దుర్మార్గమని తూర్పు గోదావరి జిల్లా రాజమహేం­ద్రవరం కాపు జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు జేఏసీ నేతల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. కాపు జేఏసీ నేతలు నందెపు శ్రీనివాస్, యాళ్ల సురేష్, మానే దొరబాబు, అడపా అనిల్, రాయవరపు గోపాలకృష్ణ, ఆకుల ప్రకాష్, వలవల దుర్గాప్రసాద్,  నామన వాసు, బురిడీ త్రిమూర్తులు, సూరిబాబు  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు