-

ఏటీఎం సెంటర్ సెక్యూరిటీ గార్డే దొంగ..

16 Feb, 2016 15:28 IST|Sakshi

లక్కిరెడ్డిపల్లె : వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఎస్‌బిఐ ఏటీఎం సెంటర్ దగ్గర బంగారు నగల చోరీకి పాల్పడింది... అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డేనని తేలింది. ఎస్‌బీఐ స్థానిక శాఖ వద్ద గార్డ్‌గా పనిచేస్తున్న శ్రీరాములు సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బ్యాంకు ఏటీఎం సెంటర్కు వెళ్లాడు. వాహనాన్ని నిలిపి లోపలికి వెళ్లి నగదు డ్రా చేసుకుని వచ్చాడు.

ఈలోగా ఏటీఎం సెంటర్ బయట సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న విశ్వనాథ్.. శ్రీరాములు ద్విచక్రవాహనంలో ఉంచిన 30 తులాల బంగారు ఆభరణాల బ్యాగును కొట్టేశాడు. నగల బ్యాగు కనిపించకపోవడంతో కంగారుపడ్డ శ్రీరాములు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడింది సెక్యూరిటీ గార్డ్ విశ్వనాథ్‌గా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు