బీన్యూ ఏలూరు షోరూమ్‌ ప్రారంభించిన కేథరీన్‌

17 Oct, 2017 12:33 IST|Sakshi
ప్రజలతో సెల్ఫీ తీసుకుంటున్న కే«థరీన్‌ థెరెస్సా

ఏలూరు(సెంట్రల్‌): స్థానిక  ఆర్‌ఆర్‌ పేటలో సోమవారం బీన్యూ మల్టీ బ్రాండ్‌ మొబైల్‌ షోరూంను హీరోయిన్‌ కేథరిన్‌ «థెరెస్సా ప్రారంభించారు. అనంతరం నూతనంగా విడుదలైన కొన్ని కంపెనీల ఫోన్లును ఆమె విడుదల చేశారు. కే«థరిన్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్‌ ఒక భాగం అయిందని అందుకు అనుగుణంగా లేటెస్ట్‌ టైక్నాలజీ మొబైల్స్‌ను మార్కెట్‌లో  ముందుగా అతి తక్కువ ధరలకే బీన్యూ వినియోగదారులకు అందిస్తోందన్నారు. బీన్యూలో దీపావళికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారని ఏలూరు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  తాను తమిళంలో హీరోలు జీవ, విశాల్‌తోను, తెలుగులో రవితేజతో ఒక్కో సినిమాలో నటిస్తున్నట్టు తెలిపారు.

బీన్యూ చైర్మన్‌  బాలాజీ చౌదరీ మాట్లాడుతూ  తమ షోరూమ్‌లో ప్రతి కంపెనీకి ఏజెంట్‌ను నియమించామన్నారు. కస్టమర్లు అభిరుచులకు అనుగుణంగా షోరూంలో యువతీయువకులను నియమించి వారికి  ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు  త్వరలో ఏపీ, తెలంగాణలో కలిపి 100 షోరూంల వరకు ప్రారంభించనున్నట్టు చెప్పారు. బీన్యూ షోరూం ద్వారా 600 మందికి ఉపా«ధి కల్పించడం సంతోషకరమని, కస్టమర్లకు మంచి సర్వీస్‌ ఇవ్వాలని ప్రముఖ వ్యాపారవేత్త ఉషా బాలకృష్ణ కోరారు. కే«థరీన్‌ థెరిస్సాను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున షోరూం వద్దకు తరలిరావడంతో ఆమె  కొద్దిసేపు వారితో ముచ్చటించారు. బీన్యూ సేల్స్‌ హెడ్‌ సాంబయ్య, మార్కెటింగ్‌ హెడ్‌ ఆనందవర్దన్, వినోద్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు