సైకిల్, గ్లాస్‌ ఒక్కటేరా..

19 Mar, 2019 15:16 IST|Sakshi

అది నెల్లూరులోని ఓ వీధిలో ఉన్న కేఫ్‌..
రవి: రేయ్‌ పిల్లకాయ్‌.. ఏం ఆలోచిస్తున్నావ్‌? త్వరగా టీ తాగు. పోదాం..
ప్రవీణ్‌ : ఏం లేదన్నా.. నాకొకటి అర్థం కావట్లేదు. మా సేనాని మీ పార్టీవోళ్లని వదిలేసి ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్నాడు. సీట్లు కూడా మీ పార్టీకి అనుకూలంగా ప్రకటించాడు. ఇది కరెక్టేనా అన్నా.  
రవి: ఏందిరా తమ్ముడూ.. కొత్తగా మాట్లాడతన్నావ్‌? ఏమైందిరా. నీకు బ్రెయిన్‌ వాష్‌ చేయాల్సిందే. పైన, కింద మనం ఒకటేరా. అప్పుడు పబ్లిగ్గా కలిసున్నాం. ఇప్పుడు రహస్యంగా కలిసుంటున్నాం. మనం వేరు కాదురా. 
ప్రవీణ్‌ : అన్నా.. పబ్లిక్‌ పిచ్చోళ్లు కాదే. వాళ్లకి అన్నీ అర్థమవుతున్నాయ్‌.
రవి: వామ్మో.. నీకు అర్థమయ్యేలా చెప్పాల్సిందే. చూడు పిల్లోడా.. అమరావతి పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరుగుతున్నా, అధికారులపై దాడులు పెరిగినా, ప్రాజెక్ట్‌ల్లో అవినీతి ఏరులై పారుతున్నా, పెట్టుబడుల సదస్సుల పేరుతో అబద్ధాలు చెబుతున్నా, హత్యా రాజకీయాలు చేస్తున్నా, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని జనం చెవిలో పూలు పెట్టినా, ఇసుక, మట్టి, గ్రావెల్‌ ఇష్టమొచ్చినట్టు తవ్వేసి దోపిడీ చేస్తున్నా, ఓటుకు నోటిస్తూ అడ్డంగా దొరికిపోయినా బాబోరిని మీ సేనాని ప్రశ్నించలేదు. ఎందుకంటావు? అది వాళ్లిద్దరి మధ్య ఉన్న ఒప్పందం. బాబోరి మీద ఈగ వాలనివ్వడు. ఆయనకు ఏదైనా సమస్య వస్తే ప్రతిపక్షాన్ని తిట్టి డైవర్ట్‌ చేస్తాడు.  
ప్రవీణ్‌ : థ్యాంక్స్‌ అన్నా.. భలే విషయం చెప్పావు.. ఇంత వరకు నాకు ఈ రాజకీయం తెలవదు.
రవి: హా.. మీరు మంచోళ్లు రా. ఎప్పుడూ మా కోసమే పని చేస్తారు. సోషల్‌ మీడియాలో కూడా టీడీపీ అవినీతిపై ఎవరైనా మాట్లాడితే వాళ్లని వ్యక్తిగతంగా తిట్టి డైవర్ట్‌ చేయ్‌. ఇప్పటికే మనోల్లు చాలా మంది అట్లనే చేస్తున్నారు. అంటూ  వెళ్లాపోయారు.
ఓ పెద్దాయన వీరి మాటలిని ‘ఖర్మ రా బాబు’ అనుకుంటూ పైకి లేచాడు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు