అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

8 Jun, 2019 08:12 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికలు పద్ధతి ప్రకారం జరగలేదని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సొంత పార్టీ నేతల వద్ద అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి జనసేన పార్టీ తరుఫున పోటీ చేసిన అభ్యర్థులతో నిన్న(శుక్రవారం) ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో జిల్లాల వారీగా వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎన్నికలు పద్ధతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని వారితో చెప్పారు. 

2014 ఎన్నికల సమయంలో గానీ, ఇప్పుడు 2019 ఎన్నికల సమయంలో గానీ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ శూన్యత లేదని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. అయినా, ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కేంద్రంలో ఉన్న బీజేపీలతో పోరాడామన్నారు. ఈ ఫలితాలతో దిగులుపడకుండా ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకొని ముందుకు వెళ్దామని పార్టీ నేతలకు సూచించారు. ఈ ఎన్నికల్లో పార్టీ తరుఫున గెలిచిన తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను పవన్‌ అభినందించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు