నల్ల గేదె.. తెల్ల దూడ

19 Jul, 2014 00:45 IST|Sakshi
నల్ల గేదె.. తెల్ల దూడ

సాధారణంగా గేదెలు నల్లగా ఉంటాయి. వాటి దూడలూ అదే రంగులో ఉంటాయి. కానీ తూర్పు గోదావరి జిల్లా చెముడులంకలో శుక్రవారం ఓ గేదెకు తెల్ల దూడ పుట్టింది. పాలూరి సురేష్‌కు చెందిన ఈ గేదెకు నాలుగో ఈతలో పుట్టిన దూడ ఆవుదూడను పోలి ఉండడం అం దరినీ ఆశ్చర్యపరిచింది. మూడు ఈతల్లో పుట్టిన దూడలు మామూలుగానే ఉన్నాయని సురేష్ తెలిపారు. ఆల్భినిజమ్ డెఫిషియెన్సీ ఆఫ్ మెల నిన్ పిగ్మెంటేషన్ ప్రభావంతో జన్యుపరమైన లోపాలు తలెత్తి గేదె దూడలకు చర్మం తెల్లగా వచ్చే అవకాశం ఉందని పశుసంవర్థకశాఖ  ఏడీ ఎం.రామకోటేశ్వరరావు చెప్పారు.
 
 

మరిన్ని వార్తలు