ముందు బిల్లుపై చర్చ జరగాలి: బుగ్గన

21 Jan, 2020 11:11 IST|Sakshi

సాక్షి, అమరావతి: అభివృద్ధి, వికేంద్రీకరణ బిల్లును ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసన మండలిలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష టీడీపీ నోటీసు ఇచ్చింది. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి బిల్లులను ప్రవేశపెట్టకుండా ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. రూల్ 71 ప్రకారం ముందు ప్రభుత్వ పాలసీపై ఇచ్చిన మోషన్‌పై చర్చ జరగాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో యనమల వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన మంత్రి బుగ్గన.. శాసనసభలో ఆమోదించిన బిల్లులపై ముందు చర్చ జరగాలన్నారు. ‘‘శాసనసభ చేసిన చట్టానికి మండలిలో ప్రాధాన్యం ఇస్తారా..? లేక పాలసీపై మోషన్‌కు ప్రాధాన్యం ఇస్తారా...? సభలకు విలువ లేకపోతే చట్టాలు ఎలా చేస్తారు. ముందు వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరగాలి’’ అని పేర్కొన్నారు. వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినందున చర్చ జరగాల్సిందే అని స్పష్టం చేశారు. 

కాగా అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం విదితమే. మూడు రాజధానులు ఏర్పాటు అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సుధీర్ఘ చర్చల అనంతరం ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ.. సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా బిల్లు ఆమోదం పొందింది. అనంతరం సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లును సైతం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోదించింది.

ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి?

సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం 

సంక్షేమ పథకాలు వదిలేద్దామా!

ప్రతిపక్ష నేతవా.. సంఘ విద్రోహ శక్తివా?

వికేంద్రీకరణ వద్దు.. అమరావతే ముద్దు: చంద్రబాబు

మరిన్ని వార్తలు