అలరించిన మిమిక్రీ

22 Feb, 2015 03:31 IST|Sakshi

కర్నూలులోని జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాత్రి శివారెడ్డి చేసిన మిమిక్రీ నవ్వులు పూయించింది.
 
 కర్నూలు(జిల్లా పరిషత్): జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజి వార్షికోత్సవంలో శివారెడ్డి మిమిక్రీ అలరించింది. శనివారం రాత్రి ఆ కళాశాల ఆవరణలో కల్చరల్, స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి మాట్లాడుతూ.. తన జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నానన్నారు. రకరకాల ఉద్యోగాలు, పలు రకాల వ్యక్తులతో మెలగాల్సి రావడం ప్రస్తుత వృత్తికి దోహదపడిందన్నారు.

నలుగురినీ నాలుగు కాలాల పాటు నవ్వించే ఆరోగ్యాన్ని భగవంతున్ని కోరుకుంటున్నాన్నారు.  కళాశాల చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఒక వ్యక్తి పరిపూర్ణత సాధించాలంటే మానసిక,శారీరక వికాసాలు పెరగాలన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసాల కోసం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా తమ కళాశాల ప్రోత్సహిస్తోందన్నారు. జి.పుల్లారెడ్డి చారిటీస్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ జి.రాఘవరెడ్డి మాట్లాడుతూ.. తమకు, తమ పిల్లలకు, పరిసరాల్లోని వారికి జి. పుల్లారెడ్డి నైతిక విలువలు పాటించేలా కథలు ఎలా చెప్పేవారో తెలిపారు. అధ్యాపకుల సూచనలు తనకు ఏవిధంగా ఉపయోగపడ్డాయో 1984-88 పూర్వ విద్యార్థి, ఈఆర్‌ఎస్ మెటల్స్ ప్రైవేటు లిమిటెడ్, చెన్నై డెరైక్టర్  పివిఎస్ మూర్తి వివరించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
 

మరిన్ని వార్తలు