చచ్చినా.. కష్టమే..!

24 Oct, 2017 08:09 IST|Sakshi
ర్రన్న మృతదేహాన్ని మనువడి ఊరికి తీసుకువెళ్తున్న కుటుంబ సభ్యులు

ఇదీ బొమ్మేపల్లె వాసుల పరి(దు)స్థితి

చనిపోయిన వ్యక్తికి మనువడి ఊరిలో అంత్యక్రియలు

పునరావాస గ్రామంలో శ్మశాన వాటిక లేక ఇక్కట్లు

సాక్షి కడప : గండికోట ముంపు గ్రామాల ప్రజలు.. ప్రాజెక్టు కోసం అన్నీ త్యాగం చేసినా.. వారికి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. కనీస వసతులు కల్పించడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో ముంపు గ్రామమైన బొమ్మేపల్లె వాసులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తినడానికి కాస్త తిండి.. చనిపోతే కొంత స్థలం అవసరం. అయితే మొదటి దానికి ఇబ్బంది లేకున్నా.. రెండవ దానికి మాత్రం నానాయాతన పడుతున్నారు. గండికోట ముంపు గ్రామమైన బొమ్మేపల్లె వాసులకు ఆర్టీపీపీ పరిధిలోని కలమల వద్ద పునరావాసం కల్పించారు. అయితే అక్కడ శ్మశాన వాటికకు స్థలం కేటాయించక పోవడంతో చనిపోయిన వారికి కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు.

కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఎర్రన్న (85) రెండు రోజుల క్రితం చనిపోయారు. అయితే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో భాగంగా అక్కడ నివసిస్తున్న బొమ్మేపల్లె వాసులకు శ్మశాన స్థలం లేదు. దీంతో అక్కడే విలపిస్తూ తరువాత ఆలోచన చేసిన ఆయన కుటుంబ సభ్యులు ఎట్టకేలకు మనువడి ఊరికి తీసుకెళ్లి అంత్య క్రియలు నిర్వహించారు. మనువడి గ్రామమైన అనంతపురం జిల్లా తిమ్మంపల్లి మండలం కల్లూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. కనీసం ఉన్నతాధికారులైనా స్పందించి బొమ్మేపల్లెకు సంబం« దించి ఎక్కడో ఒక చోట శ్మశాన వాటికకు స్థలం మంజూరు చేయాలని అక్కడ నివసిస్తున్న ప్రజలు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు