కేసీఆర్ వచ్చి ఉండాల్సింది!

24 Jul, 2014 02:19 IST|Sakshi
కేసీఆర్ వచ్చి ఉండాల్సింది!

గవర్నర్ ఇఫ్తార్ విందుకు రాకపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్య
మైనారిటీల అభివృద్ధికి అందరూ కట్టుబడాలన్న గవర్నర్ నరసింహన్

సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ఇచ్చిన విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చి ఉండాల్సిందని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాజ్‌భవన్‌లో బుధవారం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు కేసీఆర్ రాకపోవడంతో ఆయన ఇలా వ్యాఖ్యానించారు.  విందుకు హాజరైన తెలంగాణ మంత్రులతో చంద్రబాబు సరదాగా మాట్లాడారు. ఈ విందుకు చంద్రబాబు, వైఎస్ జగన్‌తో పాటు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్, మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీసీఎం మహమూద్ అలీ, మంత్రులు ఈటెల , నాయిని ్డ,  టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ,  వైఎస్‌ఆర్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, సీపీఐ ఇరు రాష్ట్రాల కార్యదర్శులు  వెంకటరెడ్డి, రామకృష్ణ, సీపీఎం ఎమ్మెల్యేరాజయ్య , ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఇరు రాష్ట్రాల డీజీపీలు అనురాగ్ శర్మ, జేవీ రాముడు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని విశేషాలు:

చంద్రబాబుకు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా నమస్కరించగా.. ఆయన ప్రతి నమస్కారం చేశారు.

ఫొటోలు దిగుతున్న సందర్భంలో ‘జగన్’ అని పిలిచి మరీ ఫోటో దిగేందుకు రావాలని గవర్నర్ నరసింహన్ కోరారు.

ఇఫ్తార్ విందు తర్వాత బయటకు వెళుతున్న సమయంలో వైఎస్ జగన్‌ను టీ-కాంగ్రెస్ నేత జానారెడ్డి ఆప్యాయంగా పలకరించారు.
 

మరిన్ని వార్తలు