నయ వంచకుడు చంద్రబాబు

5 Mar, 2019 15:37 IST|Sakshi

ప్రత్యేక హోదా విషయంలో బాబు నిర్లక్ష్యం

జగన్‌తోనే మత్స్యకారుల అభివృద్ధి 

ఎన్నికల శంఖారావం పాదయాత్రలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి

సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం:  అబద్ధపు హమీలిచ్చి ప్రజలను మోసగించిన నయవంచకుడు చంద్రబాబునాయుడని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. విడవలూరు మండలం రామచంద్రాపురం పంచాయతీలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ప్రారంభించిన ఎన్నికల శంఖారావ పాదయాత్రలో ఆయన మాట్లాడారు. పాదయాత్రకు రెండు వేల మందికి పైగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబునాయుడు నిర్లక్ష్యం వహించాడన్నారు.  ప్రత్యేకహోదా లేని కారణంగా నేడు ప్రజలు ఉద్యోగాల కోసం అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పొదుపు మహిళలు, రైతులు, విద్యార్థులపై కపటప్రేమ చూపుడుతున్నాడన్నారు. గత ఎన్నికలో మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నేడు ఎన్నికల సమయంలో మరోసారి ప్రజలను మభ్య పెట్టేందుకు సిద్ధమయ్యాడని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉండేవని, దీంతో యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండేవని గుర్తుచేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేవలం జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. ఈ సారి ఎన్నికల్లో  జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. మళ్లీ రాష్ట్రంలో మంచి రోజులు త్వరలోనే రానున్నాయన్నారు. 


జగన్‌మోహన్‌రెడ్డితోనే మత్స్యకారుల అభివృద్ధి 
మత్స్యకారుల అభివృద్ధి కేవలం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే జరుగుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి  ముఖ్యమంత్రి అయిన వెంటనే మత్స్యకారులకు పెద్దపీట వేస్తామన్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన పాండిచ్చేరి, కడలూరు తదితర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు భారీ బోట్లతో రాష్ట్రంలోని తీర ప్రాంతాలకు వచ్చి మన మత్స్య సంపదను దోచుకెళుతున్నారన్నారు. జిల్లాలోని దద్దమ్మ మంత్రులు చూసీచూడనట్లుగా ఉంటున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి, ప్రభుత్వ జీఓలను సవరించి మత్స్యకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే వేట విరామ సమయంలో ప్రతి మత్స్యకారునికి రూ.10 వేల పరిహారం ఇస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని గుర్తుచేశారు. అలాగే వేట సమయంలో ఎవరైనా మత్స్యకారులు మృతి చెందితే వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. 


తీరంలో టీడీపీ ఖాళీ
పాదయాత్ర సందర్భంగా రామచంద్రాపురం పంచాయతీలోని పాతూరు, కోత్తూరు, లక్ష్మీపురం, వెంకటనారాయణపురం, పొన్నపూడి, రామచందారపురం గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు భారీ సంఖ్యలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరిని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ తీరంలో టీడీపి ఖాళీ అయిందన్నారు. టీడీపీ చేసే మోసాలను తెలుసుకుని మత్స్యకారులంతా వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారని పేర్కొరు. కార్యక్రమంలో విడవలూరు, ఇందుకూరుపేట, కొడవలూరు. బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు,  మండల కన్వీనర్లు బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, గంధం వెంకటశేషయ్య, ఇప్పగుంట విజయ్‌భాస్కర్‌రెడ్డి , నలుబోలు సుబ్బారెడ్డి, నాయకులు దువ్వూరు కళ్యాణరెడ్డి,  సూరా శ్రీనివాసులరెడ్డి, పూండ్ల అచ్యుత్‌రెడ్డి, కొండూరు అనీల్‌బాబు, కొండూరు వెంకటసుబ్బారెడ్డి, మాతూరు శ్రీనివాసులరెడ్డి, ఓగు నాగేశ్వరరావు పాల్గొన్నారు. 


 

మరిన్ని వార్తలు