ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ: సీఎం జగన్‌

22 Nov, 2019 14:53 IST|Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకంలో మిగిలిపోయామని ఎవరైనా భావిస్తే వారు బాధపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకంపై ముఖ్యమంత్రి శుక్రవారం తన కార్యాలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఈ పథక లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచామని, అర్హతలు ఏంటి? ఎవరికి దరఖాస్తు చేయాలి? ఎవరిని సంప్రదించాలి? అనే వివరాలను జాబితాలో పొందుపరిచామని తెలిపారు. అర్హత ఉందని భావించిన వారు జాబితాలో పొందుపరిచిన సమాచారం ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.

గ్రామ సచివాలయాలు, వార్డు వాలంటీర్లు దరఖాస్తు చేయడంలో తోడ్పాటునందిస్తారని పేర్కొన్నారు. ఇది నిరంతరం కొనసాగుతందంటూ ప్రతి శుక్రవారం కొత్త లబ్దిదారులకు నగదు సహాయం అందజేస్తామని ప్రకటించారు. గురువారం ముమ్మిడివరం నియోజకవర్తం కొమానపల్లిలో ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో ఈ అంశాలను చెప్పడం మర్చిపోయానని, ఈ విషయాలను ప్రజలకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తూ.. బీసీ అంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు. సమాజానికి బ్యాక్‌ బోన్‌లంటూ అభివర్ణించారు.  

మరిన్ని వార్తలు