వారి ప్రయోజనాలు కాపాడండి: సీఎం వైఎస్‌ జగన్

10 May, 2020 18:19 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏజెన్సీ రిజర్వేషన్ల వ్యవహారంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ దృష్టి సారించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతంలో టీచర్స్‌ నియామకాల్లో 100 శాతం రిజర్వేషన్ల అమలు జీవో నెంబర్‌ 3ను సుప్రీం కోర్టు ఇటీవల కొట్టివేసిన నేపథ్యంలో ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై అడ్వకేట్‌ జనరల్‌ సుబ్రహ్మణ్య శ్రీరామ్‌తో సమీక్ష జరిపిన వైఎస్‌ జగన్‌ గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గిరిజన వర్గాల్లో ఆందోళన నెలకొని ఉంది. అయితే ఈ అంశాన్ని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తీర్పును క్షుణ్నంగా అధ్యయనం చేసి న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచనలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన జీవో కనుక, తీర్పు ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఉంటుందని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. చదవండి: విదేశాల నుంచి వ‌చ్చేవారి వివ‌రాలు న‌మోదు

'ఆయనను ఇక గొలుసులతో కట్టేయాల్సిందే' 

మరిన్ని వార్తలు