రైతు భరోసాకై ప్రత్యేక స్పందన కార్యక్రమం

6 Nov, 2019 16:41 IST|Sakshi

సాక్షి, అమరావతి : సాధారణ రైతులు నవంబరు 15లోగా రైతు భరోసా పథకాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ పథకం కింద లబ్ది పొందే రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే శనివారం ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించి వాటిని పరిష్కరించాలని కల్లెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... రైతు భరోసా అమలులో భాగంగా కౌలు రైతులకు గడువు మరింతగా పెంచినట్లు పేర్కొన్నారు. ‘రబీ సీజన్‌ ఇప్పుడే మొదలైంది కాబట్టి కౌలు రైతులకు గడువు పెంచుతున్నాం. రైతుల్లో, కౌలు రైతుల్లో అవగాహన పెరిగి ఇప్పడిప్పుడే సాగు ఒప్పందాలు చేసుకుంటున్న నేపథ్యంలో వారికి మాత్రమే డిసెంబర్‌ 15 వరకు గడువు ఇస్తున్నాం’ సీఎం జగన్‌ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు