కో-ఆప్షన్ కోలాటం

29 Jul, 2014 02:06 IST|Sakshi


 ఏలూరు : ఏలూరు నగరపాలక సంస్థ, ఏడు మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించేందుకు యం త్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. నగరపాలక సంస్థలో ఐదు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలో మూడేసి చొప్పున మొత్తం 28 కో-ఆప్షన్ పదవులకు ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఈనెల 3న ఆయూ సంస్థల్లో కొత్త పాలకవర్గాలు పగ్గాలు చేపట్టిన విషయం విదితమే. పాలకవర్గాలు కొలువైన రెండు నెలల్లోగా కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది.
 
 ఈ నేపథ్యంలో సభ్యుల ఎన్నికకు ఏర్పాట్లు  చేయూల్సిందిగా పురపాలక శాఖ డెరైక్టర్ డి.వరప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేసి, ఆగస్టు 15లోగా ఎన్నిక ప్రక్రియను ముగించే అవకాశాలు కనిపిస్తున్నారుు. ఈ పదవులను ఎవరికి కట్టబెట్టాలనే విషయమై టీడీపీ పెద్దలు తర్జనభర్జన పడుతున్నారు. పురపాలనలో అనుభవం గల వారిని కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోవాలని మునిసిపల్ చట్టం చెబుతోంది. పురపాలక సంఘాల్లో పనిచేసి రిటైరైన అధికారులు, రోడ్లు, భవనాల శాఖ, వాటర్ వర్క్స్, టౌన్‌ప్లానింగ్ విభాగాల్లో పనిచేసిన నిపుణులను తీసుకోవాల్సి ఉంది.
 
 స్టాండింగ్ కమిటీల్లో మూడే ళ్లు పనిచేసిన న్యాయవాదుల్లో కనీసం ఒక్కరికైనా అవకాశం కల్పించే పరిస్థితి ఉంది. తద్వారా పురపాలనలో అమూల్యమైన సలహాలు, సూచనలు పొం దేందుకు కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలని చట్టం చెబుతోంది. అరుుతే, ఆ దిశగా ఏ ప్రభుత్వాలూ చర్యలు తీసుకోవలేదు. ప్రస్తుత ప్రభుత్వం పరి స్థితి కూడా అలాగే కనిపిస్తోంది. కనీసం మైనార్టీల నుంచి ఎంపిక చేసే సభ్యుల విషయంలోనూ అనువభవజ్ఞులకు చో టు కల్పించే దిశగా పాలకవర్గాలు అడుగులు వేయాల్సిన అవసర ం ఉంది.

మరిన్ని వార్తలు