మూడేళ్లలో రాజధాని తొలి దశ నిర్మాణం

24 Sep, 2014 06:58 IST|Sakshi
మూడేళ్లలో రాజధాని తొలి దశ నిర్మాణం

ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని తొలి దశ నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ చెప్పారు. రాజధానికి ల్యాండ్ పూలింగ్ (రైతుల నుంచి భూ సమీకరణ) విధానాన్నే అవలంభిస్తామని తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. నెల రోజుల్లో రాజధాని నిర్మాణానికి సంబంధించిన నివేదిక ఇస్తామని, అనంతరం 8 నెలల నుంచి ఏడాదిలోగా భూ సమీకరణ పూర్తి చేస్తామని తెలిపారు.

ఆ తర్వాత రెండేళ్లలో తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాజధాని సలహా కమిటీ త్వరలోనే నోయిడా, నవీ ముంబై, పుణెలలో పర్యటిస్తుందని చెప్పారు. వచ్చే నెలలో సింగపూర్‌కు వెళుతోందని, అనంతరం రాజధాని నిర్మాణంపై తుది నివేదిక ఇస్తామని తెలిపారు. ఆ తర్వాతే భూ సమీకరణపై విధానాన్ని ప్రకటిస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు