నేటి నుంచి కాంట్రాక్ట్‌ వైద్యుల నిరసన

7 Sep, 2018 13:11 IST|Sakshi
ఐటీడీఏ పీఓ లక్ష్మీషాకు సమ్మె నోటీసును అందజేస్తున్న ఒప్పంద వైద్యులు

ఓపీ చూడకుండా నిరసన

అత్యవసర కేసులను చూడడానికి సిద్ధం  

విజయనగరం, పార్వతీపురం: జిల్లా వ్యాప్తంగా పలు ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న  ఒప్పంద వైద్యులు శుక్రవారం నుంచి ఈ నెల 10వరకు నిరసన తెలియజేయనున్నారు. ఈ మేరకు గురువారం పార్వతీపురం ఐటీడీఏ పీఓ డాక్టర్‌ జి.లక్ష్మిషాను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుంచి  ప్రభుత్వం శాశ్వత పద్ధతిలో  వైద్యులను  నియమించడం లేదని తెలిపారు. 1850 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా  ఖాళీగా ఉన్నాయని ఒక్క విజయనగరం జిల్లాలోనే 62 పీహెచ్‌సీలు, 14సీహెచ్‌సీలు, ఒక ఏరియా ఆసుపత్రి, ఒక జిల్లా ఆసుపత్రి  ఉండగా అందులో దాదాపు 96 మంది కాంట్రాక్ట్‌ వైద్యులు పనిచేస్తున్నట్టు వారు  పీఓకు తెలిపారు. వీరందరిని పర్మినెంట్‌ చేయాలని ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో శుక్రవారం నుంచి ఓపీ చూడకుండా నిరసన తెలియజేయనున్నట్టు వారు తెలిపారు.

>
మరిన్ని వార్తలు