ఏపీ సీఎం సహాయనిధికి విరాళాలు

3 Apr, 2020 17:16 IST|Sakshi

సాక్షి, అమరావతి : కోవిడ్‌-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి గంగవరం పోర్టు తరపున రూ.3 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పోర్టు చైర్మన్‌ డివిఎస్‌ రాజు, సీఈఓ,మాజీ డీజీపీ ఎన్‌ సాంబశివరావులు కలిసి అందజేశారు. దీంతోపాటు గంగవరం పోర్టులో షేర్‌ హోల్డర్‌గా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రూ.16.25 కోట్లు ఇంటర్మ్‌ డివిడెండ్‌ చెక్‌ను కూడా ముఖ్యమంత్రికి అందజేశారు. (చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ)

కర్నూలు : 
►ముఖ్యమంత్రి సహాయనిధి కింద రిటైర్డ్ డీఆర్‌వో సుబ్బారెడ్డి రూ. లక్ష చెక్కును నంద్యాల ఆర్‌డీవో రామకృష్ణరెడ్డికి అందజేశారు.
►ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. లక్షా యాబై వేల చెక్కును ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డికి నంద్యాల మెడిసేవ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రామచంద్రారెడ్డి అందించారు.
►ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో ప్రజలకు కరుణ వ్యాధిపై నియంత్రణ చర్యలపై ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి అవగాహన కలిగించారు. తర్వాత ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. 

గుంటూరు : 
►వైఎస్సార్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
►ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ నేతృత్వంలో తెనాలిలోని తూర్పు కాల్వకట్టపై ఉన్న పేదలకు ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు.
►ఎమ్మెల్యే విడదల రజిని ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో 350 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, కూరగాయలు పంపిణీ చేశారు. 
►ఏపీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో 2వేల మాస్కులు అందజేశారు.  

ప్రకాశం జిల్లా :
►ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ తన సొంత నిధులతో కనిగిరి కాశి రెడ్డి నగర్ ఎస్టీ కాలనీలో 1000 కుటుంబాలకు ఉచిత బియ్యం, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేశారు.
►కరోన వైరస్ నేపథ్యంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో దర్శి ఆటోనగర్‌లో పేదలకు నిత్యావ‌స‌రాలు, బియ్యం, కూర‌గాయ‌లు అందజేశారు.

హైదరాబాద్‌ :
కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం కోసం నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతమ్ విద్యా సంస్థల చైర్మన్ ఎమ్‌. భరత్ కోటి రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ఏపీ ముఖ్యమంత్రి స‌హాయనిధికి రూ. 50 ల‌క్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి స‌హాయ‌నిధికి రూ. 25 ల‌క్షలు, కర్ణాటక ముఖ్యమంత్రి స‌హాయ‌నిధికి రూ. 25 ల‌క్షలు అంద‌జేస్తున్నట్లు తెలిపారు. ఈ విప‌త్కర ప‌రిస్థితిని స‌మ‌ష్టిగా ఎదుర్కోవాల‌ని, ప్రజలు అంద‌రూ ఇళ్లలోనే సుర‌క్షితంగా ఉండాల‌ని ఆయ‌న విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు