అభివృద్ధికి విఘాతం

28 Oct, 2014 23:49 IST|Sakshi
అభివృద్ధికి విఘాతం

సాక్షి, గుంటూరు :
 గుంటూరు నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామ పంచాయతీలకు సంబంధించి దాదాపు రూ.10 కోట్లకు పైగా నిధులు ట్రెజరీలో మూలుగుతున్నాయి.  వీటి గురించి కార్పొరేషన్ అధికారులు ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫలితంగా ఆయా గ్రామాల్లో అభివృద్ధి సైతం కుంటుపడుతోంది. వివరాల్లోకివెళితే...

     నగరపాలక సంస్థలో విలీనమైన తరువాత ఆయా పంచాయతీలకు సంబంధించిన అన్ని రకాల నిధులను ట్రెజరీ అధికారులు కార్పొరేషన్‌కు బదిలీ చేయాలి.
     ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ట్రెజరీ ప్రధాన కార్యాలయం, సంబంధిత పంచాయతీరాజ్ శాఖ, జిల్లా కలెక్టర్ నుంచి అందాలి. అలా జరిగి ఉంటే ఆ నిధులు ఎప్పడో గ్రామ పంచాయతీల నుంచి కార్పొరేషన్‌కు బదిలీ అయ్యేవి.
     ఇక్కడ కార్పొరేషన్ అధికారులు సైతం ఆ నిధుల గురించి పట్టించుకోక పోవడం వల్ల  ఈ సమస్య ఉత్పన్నమైంది. ఫలితం గా విలీన గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది.
     జిల్లా పంచాయతీ అధికారి 279 జీవో ప్రకారం విలీనమైన 10 గ్రామ పంచాయతీలకు సంబంధించి కార్పొరేషన్‌కు బదిలీ చేయాల్సిన నిధులు ఎన్ని ఉన్నాయో తెలియజేయాలని ఏటీవో(అసిస్టెంట్ ట్రెజరీ అధికారి)ని కోరారు.
     ఆ మేరకు 2013 అక్టోబరు 25న నిధుల జాబితాను ట్రెజరీ అధికారులు సిద్ధం చేసి కార్పొరేషన్,పంచాయతీ అధికారులకు పంపారు.
     ఆ తరువాత  ఆ నిధుల గురించి ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ కారణంగా  విలీన గ్రామాల్లో ఉద్యోగులకు సైతం మున్సిపల్ సాధారణ నిధుల నుంచి జీతాలు చెల్లిస్తున్నారు.
     2011,12,13  ఆర్థిక సంఘం నిధులతో పాటు పలు రకాల నిధులున్నాయి. ఇవన్నీ కలిపి దాదాపు రూ. 10 కోట్ల మేర ఉంటాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
     నిధుల విడుదలకు సంబంధించి కార్పొరేషన్,పంచాయతీ అధికారులు స్పందించి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిధుల విడుదలకు కృషి చేయావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
 
 పంచాయతీల సాధారణ నిధులు ఇవే
 
 పంచాయతీపేరు         నిధులు                         పంచాయతీపేరు         నిధులు
                            (రూ. లక్షల్లో)                                                 (రూ. లక్షల్లో)
 
 ఆడవి తక్కెళ్లపాడు     28.49                           గోరంట్ల                  188.00
 అంకిరెడ్డిపాలెం          65.10                          నల్లపాడు                  54.91    
 బుడంపాడు              15.90                       పెదపలకలూరు             52.96
 చౌడవరం                 11.75                            పొత్తూరు                  46.34
 ఏటుకూరు              62.55                           రెడ్డిపాలెం                  54.19

మరిన్ని వార్తలు