ఉప్పొంగిన యువతరంగం

20 Sep, 2018 06:38 IST|Sakshi

జననేతను చూసేందుకు బారులుదీరిన విద్యార్థులు

జై జగన్‌.. నెక్ట్స్‌ సీఎం జగనే అంటూ నినాదాలు

పూల తివాచీ పరిచిన పల్లె వాసులు

 కొనసాగిన 266వ రోజు ప్రజాసంక్పలయాత్ర

సాక్షి, విశాఖపట్నం: యువ తరంగం ఉప్పొంగింది. వజ్ర సంకల్పంతో దూసుకెళ్తున్న ఉద్యమాల సూరీడిని చూసేందుకు పోటెత్తింది. మీరే మా ఆశాకిరణం.. మీరే మా స్ఫూర్తి.. మీరే మా దీప్తి అంటూ నినదించింది. యూత్‌ ఐకాన్‌ మీరేనని, మీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని కాంక్షించింది. రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 266వ రోజు భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండల పరిధిలోని పల్లెల మీదుగా సాగింది.

పార్టీ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, భీమిలి పట్టణ అధ్యక్షుడు అక్కరమాని వెంకట్రావు, విశాఖ, అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు తైనాల విజయకుమార్, గుడివాడ అమర్‌నాథ్, పార్లమెంట్‌ సమన్వయకర్తలు ఎంవీవీ సత్యనారాయణ, వరుదు కల్యాణిలతో పాటు పార్టీ శ్రేణులు, ప్రజలు వెంటరాగ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం ముచ్చెర్ల క్రాస్‌ వద్ద పాదయాత్ర ప్రారంభించారు. 

అక్కడి నుంచి సెంచూరియన్‌ యూనివర్సిటీ, గిడిజాల క్రాస్, గిడిజాల పంచాయతీ, లక్ష్మీదేవిపేట క్రాస్, వేమగొట్టిపాలెం మీదుగా పప్పలవానిపాలెం వరకు 6.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ముచ్చెర్లక్రాస్‌ నుంచి పప్పల వానిపాలెం వరకు అభిమాన నేతను చూసేందుకు ప్రజలు పోటెత్తారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, శ్రేణులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

యూత్‌ ఐకాన్‌ జగన్‌ 
ప్రజా సంకల్పయాత్రలో బుధవారం యువత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దారిపొడవున యువ కెరటం పోటెత్తింది. సెంచూరియన్‌ యూనివర్సిటీలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు జననేతకు ఎదురేగి స్వాగతం పలికారు. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు. మీరే యూత్‌ ఐకాన్‌.. మీరే మా సీఎం అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తించారు. అరగంటకు పైగా యూనివర్సిటీ వద్దే జననేత వారితో మమేకమయ్యారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ బాగా చదువుకోవాలి.. మీకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుంది అని ఆశీర్వదించారు. ఆ తర్వాత గిడిజాల క్రాస్‌ నుంచి గిడిజాల మధ్య ఉన్న సాయి గణపతి ఇంజినీరింగ్‌ కళాశాల, సాయి గణపతి పాలిటెక్నిక్‌ కళాశాల, సాయి గణపతి ఐటీఐతో పాటు సమీపంలోని ఎన్‌ఎస్‌ ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు వేలాదిగా జగన్‌ను చూసేందుకు తరలివచ్చారు. 

అన్న వచ్చాడోచ్‌.. జగనన్న వచ్చాడోచ్‌ అంటూ విద్యార్థులు పెద్ద పెట్టున కేరింతలు కొట్టారు. జాబు కావాలంటే జగన్‌ రావాలి, జై జగన్‌.. నువ్వు గెలవాలన్నా.. నువ్వే మా సీఎం... అంటూ నినాదాలు చేశారు. విద్యార్థులందరితో వైఎస్‌ జగన్‌ మమేకమవుతూ ప్రతి ఒక్కరితో సెల్ఫీలు తీసుకుంటూ వారేం చదువుతున్నారో అడిగి తెలు సుకుని ఉత్సాహపరిచారు. ఆయా కళాశాలల్లో పనిచేసే ప్రొఫెసర్లు, సిబ్బంది జగన్‌ను చూసేం దుకు పోటీపడ్డారు. చంద్రబాబు పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేవని, జగన్‌ వస్తే అందరికి బాగుంటుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

సమస్యల వెల్లువ
ఆనందపురం మండల పరిధిలోని ప్రజలతో పాటు విశాఖ నగర, గ్రామీణ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు పాదయాత్రలో జననేతను కలసి తమ కష్టాలు చెప్పుకున్నారు. మా గూడెంలో కనీస సౌకర్యాల్లేవని గిడిజాల పంచాయతీ గొల్లగూడెం వాసులు జగన్‌ వద్ద మొరపెట్టుకున్నారు. పారిశ్రామిక అవసరాల పేరిట ఏపీఐఐసీ తమ భూములు లాక్కొని పరిహారం ఇవ్వడం లేదని గిడిజాల గ్రామ భూ నిర్వాసితులు జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్సార్‌ సీపీ వాళ్లమని ఇళ్లు మంజూరు చేయడం లేదని వేమగొట్టిపాలెం గ్రామస్తులు జగన్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. భీమందొరపాలెం, రామవరం, ముచ్చర్ల, కొలవానిపాలెం, గిడిజాల గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని విద్యార్థులు జననేత దృష్టికి తీసుకొచ్చారు. ఆనందపురం సభకు వచ్చామని మాపై దాడి చేశారని నారాయణరాజుపేట గ్రామస్తులు జగన్‌కు తెలిపారు. రూ.10 వేల కోట్లతో కాపు యువతకు భరోసా దొరుకుతుందని విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు యువత జగన్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. 

ప్రజా సంకల్ప పాదయాత్రలో మైదుకూరు ఎమ్మెల్యే ఎస్‌.రఘురామిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, విశాఖ పార్లమెంట్‌  సమన్వయకర్త ఎం.వి.వి.సత్యనారాయణ, అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్, అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త వరుదు కల్యాణి, శ్రీకాకుళం పార్లమెంట్‌ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు, కాకినాడ పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు పెదపాటి అమ్మాజీ, సమన్వయకర్తలు అక్కరమాని విజయనిర్మల, ఉప్పలపాటి రమణమూర్తి రాజు, చెట్టి ఫాల్గుణ, కె.కె.రాజు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, రౌతు సూర్యప్రకాశరావు, జక్కంపూడి విజయలక్ష్మి, గొర్లె కిరణ్, విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్‌రాజు, ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ రెక్టార్‌ జి.ప్రసాదరెడ్డి, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రొఫెసర్‌ జేమ్స్‌ స్టీఫెన్, రాష్ట్ర కార్యదర్శులు దాట్ల వెంకట అప్పల ప్రసాదరాజు, సుంకర గిరిబాబు, తాడి విజయభాస్కరరెడ్డి, రాజమండ్రి కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, విద్యార్థి విభాగం అరకు, విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షులు తడబారిక సురేష్‌కుమార్, బి.కాంతారావు, ఎస్సీ సెల్‌ నగర, పార్లమెంట్‌ అధ్యక్షులు బోని శివరామకృష్ణ, రెయ్యి వెంకటరమణ, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్, నగర అధ్యక్షుడు కొండా రాజీవ్‌ గాంధీ, నెల్లిమర్ల నుంచి కందుల రఘుబాబు, జిల్లా నాయకులు కాకర్లపూడి వరహాలరాజు, అక్కరమాని వెంకటరావు, బంక సత్యం, మజ్జి వెంకటరావు, ఇందుకూరి రఘురాజు, పీలా ఉమారాణి, కిరణ్‌రాజు, మాజీ ఎంపీపీ కోరాడ వెంకటరావు, ప్రొద్దుటూరు నుంచి రాజారామిరెడ్డి, నాగేంద్రరెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు