విషాదయాత్ర

20 Oct, 2013 07:11 IST|Sakshi

నిజాంసాగర్ /బోధన్ టౌన్, న్యూస్‌లైన్:  సరదాగా నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన ఐదుగురు స్నేహితుల్లో ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన శనివారం చోటుచేసుకుంది. బోధన్ పట్టణానికి చెందిన అల్తాఫ్ హైమద్, మహమ్మద్ అబ్దుల్ బారి, నిసాక్, ఉమర్, వాహబ్ స్నేహితులు. బక్రీద్ పండుగ కోసం వివిధ ప్రాంతాల నుంచి ఇళ్లకు వచ్చిన వీరు  నిజాంసాగర్ ప్రాజెక్టును తిలకించేందుకు వచ్చారు. ప్రాజెక్టు 12 గేట్ల కింది భాగంలో ఉన్న నీటి మడుగు వద్ద విందు చేసుకున్నారు.అనంతరం స్నా నం చేసేందుకు మడుగులోకి దిగిన అల్తాఫ్ హైమద్, మహమ్మద్ అబ్దుల్ బారి నీటిలో మునిగి పోయారు. స్నేహితులు ఇద్దరు కళ్లముందే నీట మునుగుతుండగా మిగతా వారు రక్షించాలంటూ కేకలు వేశారు. చుట్టుపక్కల ఉన్న పర్యాటకులు మడుగు వద్దకు వచ్చేలోగా ఇద్దరు మృత్యుఒడిలోకి చేరుకున్నారు. సమాచారం అందుకున్న  ప్రొబెషనరీ ఎస్సై ప్రసాదరావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటకు తీయించారు.
 
  మృత్యువులోనూ వీడని స్నేహం..
 మృతులు సయ్యద్ అల్తాఫ్ హైమద్, అబ్దుల్ బారీలు చిన్ననాటి నుంచి మంచి మిత్రులు. మృత్యువులోను వీడకుండా ఉన్నారు.  ఇద్దరు స్థానిక విజయసాయి కళా శాలలో ఇంటర్ చదివారు. బీటెక్ స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తిచేశారు. బక్రీద్ పండుగ కోసం ఒకరు హైదరాబాద్ నుంచి మరొకరు దుబాయి నుంచి వచ్చా రు. మిత్రులతో విహారయాత్రకు వెళ్లి మృత్యు ఒడిలోకి చేరడం ఆనందరినీ కంటతడి పెట్టించింది.
 
 శక్కర్‌నగర్‌లో విషాదఛాయలు
 బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్ కాలనీకి చెందిన సయ్యద్ అబ్దుల్ రజాక్, వసీమాబేగంల నాలుగో సంతానం సయ్యద్ అల్తాఫ్ హైమద్ (22) స్థానిక ఆర్‌కే ఇంజినీరింగ్ కళాశాలలో బీటేక్ పూర్తి చే సి ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. బక్రీద్ సెలవులకు వచ్చిన అల్తాఫ్ మిత్రులతో నిజాంసాగర్‌కు వెళ్లి నీటిలో పడి మృతిచెందడం, తల్లిదండ్రులు హజ్‌యాత్రలో ఉండడం అందరిని కలిచి వేసింది. ఇంటి వద్ద గల అన్నదమ్ములు కన్నీరు మున్నీరవుతున్నారు.
 
 దుబాయ్ నుంచి వచ్చి ..
  అబ్దుల్‌బారీ మృతి వార్త విని కుటంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్ చౌరస్తాలోగల అబ్దుల్‌బారీ ఇంటి వద్ద  విషాదఛాయ లు అలుముకున్నాయి.బారీ మరణవార్త తెలిసిన బం ధువులు, మిత్రులు ఇంటి వద్దకు చేరుకుని కుటుంబీ లకును ఓదార్చారుు. అబ్దుల్ బారీ(23) స్థానిక ఆర్‌కే  ఇంజినీరింగ్ కళాశాలలో బీటేక్ పూర్తిచేసి దుబాయిలో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. బక్రీద్ పండు గ కు బోధన్‌కు వచ్చాడని బంధువులు తెలిపారు. మృతు డికి ఇద్దరు చెల్లెలు, ఇద్దరు అన్నలు ఉన్నారు.

మరిన్ని వార్తలు