విగ్రహాల తొలగింపు.. ఏలూరులో ఉద్రిక్తత

6 May, 2019 09:02 IST|Sakshi

సాక్షి, ఏలూరు :  అర్ధరాత్రి సమయంలో ఆలయంలో విగ్రహాలను తొలగించడంతో పగోజిల్లా ఏలూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏలూరులోని అంబికా థియేటర్ పక్కన ఓ సంస్థ యజమానులు మల్టిఫ్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారు. పక్కనే ఉన్న వంద సంవత్సరాల చరిత్ర కలిగిన రామాలయంలో విగ్రహాలను ఆదివారం అర్ధరాత్రి తొలగించి, గుడి కూలగొట్టే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

గుడిలో విగ్రహాలను సైతం జేసీబీతో చిందరవందర చేసి రోడ్డుపైనే పడేయడంతో విశ్వహిందూపరిషత్, భజరంగ్ దళ్ నాయకులు, స్దానికులు ఆగ్రహించారు. ఈ ఘటనపై స్థానికులు లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీబీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. ఏలూరు రూరల్ సీఐ నాయు‌డు‌, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.

మరిన్ని వార్తలు