జిల్లాలో డెంగీ విజృంభణ

24 Jul, 2014 00:28 IST|Sakshi
  •      17 డెంగీ కేసులు నమోదు
  •      ఆంధ్ర వైద్య కళాశాలలో 216 నమూనాల పరిశీలన
  •      17 మందికి వ్యాధి సోకినట్లు నిర్థారణ
  •      జిల్లా మలేరియా అధికారి ప్రసాదరావు వెల్లడి
  • మాడుగుల : జిల్లాలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. 216 మందికి విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ (కేజీహెచ్)లో రక్తపరీక్షలు నిర్వహించగా 17 మందికి డెంగీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని జిల్లా మలేరియా అధికారి కేవీఎస్ ప్రసాదరావు తెలిపారు. బుధవారం డి.గొటివాడలో పరిశీలనకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.

    వరుసగా ఐదు రోజుల తీవ్రంగా జ్వరం వచ్చి... కీళ్లనొప్పులు, కడుపునొప్పి, చర్మంపై దద్దుర్లు ఉంటే డెంగీ వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించాలని సూచించారు. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆంధ్రా మెడికల్ కాలేజీలో పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు నీటి నిల్వలు లేకుండా చేసుకుంటే ఈ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చని చెప్పారు. ఈయన వెంట ఎస్‌పీహెచ్‌వో శ్రావణ్‌కుమార్, వైద్యసిబ్బంది పరిశీలనలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు