వృద్ధుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..

1 Oct, 2019 15:40 IST|Sakshi

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

సాక్షి, విజయనగరం: వయో వృద్ధుల సంక్షేమానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయనగరం జిల్లా ఏరియా ఆసుపత్రిలో వృద్ధుల వార్డును డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధులకు అన్ని విధాలుగా చేయూతనందించే దిశగా చర్యలను చేపట్టామని తెలిపారు.

గత ప్రభుత్వం ఇస్తున్న పింఛను మొత్తాలను పెంచడంతో పాటుగా.. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక వైద్యసేవలను అందించనున్నామని వెల్లడించారు. పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో 60 ఏళ్లు దాటిన వృద్ధుల కోసం 10 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ వార్డులో వయో వృద్ధులకు ప్రత్యేకంగా పడకలను కేటాయించి అవసరమైన చికిత్సలను అందిస్తామని తెలిపారు. సేవలను సీనియర్‌ సిటిజన్లు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, అధికారులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు