వాంతులు, విరేచనాలుతగ్గితే ఒట్టు!

8 Dec, 2013 04:50 IST|Sakshi

వంగూరు, న్యూస్‌లైన్: పక్షం రోజులుగా చారకొండ గ్రామస్తులను ముప్పుతిప్ప లు పెడుతున్న వాంతులు, విరేచనాలు ఏ మాత్రం తగ్గడం లేదు. రెండురోజులుగా అతిసార మళ్లీ విజృంభించడంతో స్థానికులకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. వైద్యశిబిరం ఏర్పాటుచేసి చికిత్సలు అందజేసినా వ్యాధి ఎంతమాత్రం అదుపులో కి రావడం లేదు. కడుపుకు తిండిలేక.. ఒంట్లో సత్తువలేక బాధితులు స్థానిక వై ద్యం శిబిరంలో చికిత్స పొందుతున్నారు.

 పదుల సంఖ్యలో కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి వెళ్తున్నారు. మరికొందరు నేరుగా హైదరాబాద్‌కు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. శనివారం మరో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీ రిలో రఘు, లక్ష్మణ్, లక్ష్మమ్మ, బుజ్జి, తేజ స్విని, ధోని, నిఖిల్, శివప్రసాద్ ఉన్నారు. వీరు స్థానిక శిబిరంలో వైద్యచికిత్సలు పొందుతున్నారు. ఇదిలాఉండగా, గతరెండు రోజులుగా వ్యాధి బారినపడిన 11 మంది కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రిలో చికి త్స పొందుతున్నారు. ప్రధానంగా చారకొండ పరిసర గ్రామాలైన మర్రిపల్లి, రాంపూర్, తుర్కలపల్లి, శాంతిగూడెం, సిరసనగండ్ల గ్రామాల్లోనే అతిసారవ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. గ్రా మంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరం కొనసాగుతూనే ఉంది.
 తాగునీటి సరఫరాలో
 జాగ్రత్తలు తీసుకోండి: డీఎంహెచ్‌ఓ
 ప్రధానంగా తాగునీరు కలుషితం కావ డం వల్లే అతిసారవ్యాధి వ్యాప్తి చెందుతుందని, చారకొండ గ్రామంలోని స్కీం బోర్ల నుంచి గాని, వాటర్ ట్యాంకుల నుంచి గాని నీటిని సరఫరా చేయకుండా నేరుగా ట్యాంకర్ల ద్వారానే ప్రజలకు సరఫరా చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిణి(డీఎంహెచ్‌ఓ) రుక్మిణమ్మ అ ధికారులకు సూచించారు. శనివారం ఆ మె చారకొండ గ్రామాన్ని సందర్శించి వై ద్యశిబిరంలో చికిత్సపొందుతున్న రోగులను పరీక్షించారు. అనంతరం గ్రామ శి వారులో పైప్‌లైన్ల లీకేజీలతో ఏర్పడిన మురుగుకాల్వలను పరిశీలించారు. ఆ త రువాత స్థానికులు, బాధితులతో మాట్లాడారు. కలుషితమైన నీటిని తాగడం, ఆ హారలోపాల వల్లే అతిసార ప్రబలుతుం దన్నారు. చారకొండతోపాటు చుట్టుపక్క ల గ్రామాల్లో ఉన్న తాగునీటి బోర్లు, ఫి ల్టర్ వాటర్‌ప్లాంట్ల నీటి శాంపిల్స్‌ను ప రీక్షించేందుకు ఆదివారం జిల్లాకేంద్రం నుంచి ప్రత్యేకబృందం వస్తుందని ఆమె వివరించారు.
 వైద్యులు పట్టించుకోవడంలేదు
 వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గుై రె వైద్య శిబిరం వద్దకు వస్తే ఇక్కడ ఉన్న సిబ్బంది, డాక్టర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అతిసార బాధితులు, గ్రామస్తులు డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదుచేశారు. రెండుమందు గోళీలు ఇచ్చి రెఫర్ టు క ల్వకుర్తి అంటూ 108 ద్వారా కల్వకుర్తి ప్ర భుత్వాసుపత్రికి పంపిస్తున్నారని స్థానికు లు వాపోయారు. దీంతో ఆమె సిబ్బం దిపై అసహనం వ్యక్తంచేశారు. అవసరమైతే మరికొంత మంది సిబ్బందిని ఏ ర్పాటు చేసుకుని ఇక్కడికివచ్చే రోగులకు ఇక్కడే వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. వ్యాధి తీవ్రత ఉంటే తప్ప రె ఫర్ చేయడానికి వీల్లేదని హెచ్చరించారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే తనకు ఫోన్ చేయమని గ్రామస్తులకు సూ చించారు. డీఎంహెచ్‌ఓను కలిసిన వారి లో చారకొండ సర్పంచ్ శిల్పాదేవీలాల్, గ్రామస్తులు శ్రీనివాస్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, శ్రీను తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు