విద్యుదుత్పత్తికి అంతరాయం

9 Jun, 2014 00:43 IST|Sakshi
విద్యుదుత్పత్తికి అంతరాయం
  •       మాచ్‌ఖండ్‌లో మొరాయించిన ఒకటో యూనిట్
  •        ప్రాజెక్టుకు తప్పిన ముప్పు
  • ముంచంగిపుట్టు,న్యూస్‌లైన్: ఆంధ్ర, ఒడిశా రా ష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో రోజు రోజుకు విద్యుదుత్పత్తి దిగజారుతోంది. ఆరు జనరేటర్లకు ప్రస్తుతం ఒక్కటి మా త్రమే పని చేస్తోంది. శనివా రం రాత్రి ఒకోటో నంబర్ జనరేటర్‌లో సాంకేతిక లోపంతో విద్యుదుత్పత్తి 17 మోగా వాట్లకు పడిపొయింది.

    ఆరు జనరేటర్లతో 120 మోగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్న జలవిద్యుత్ కేంద్రంలో గత నెల 26న ఆరో నంబర్ జనరేటర్ మూలకు చేరడంతో కేవలం రెండు జనరేటర్లతో 34 మోగావాట్లు మాత్రమే విద్యుదుత్పత్తి అయ్యేది. 2,4,5 నంబర్ల జనరేటర్లు గత కొన్ని రోజులుగా మూలకు చేరాయి. ఒకోటో నంబర్ జనరేటర్‌లో సాంకేతిక లోపంతో ప్రస్తుతం మూడో నంబర్ జనరేటర్‌తో మాత్రమే 17 మోగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. తరచూ జనరేటర్లు మొరాయిస్తున్నా.. ప్రాజెక్టు ఆధునికీకరణకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు, అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు.  
     
    ప్రాజెక్టుకు తప్పిన ముప్పు : మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి పెనుముప్పు తప్పింది. విద్యుత్ ఉత్పత్తికి నీటిని సరఫరా చేసే పైపులో శనివారం రాత్రి రంధ్రం ఏర్పడి ప్రాజెక్టు లోపలికి నీరు చేరింది. అది మరింత పెరిగితే ప్రాజెక్టుకే ముప్పు ఏర్పడేది.  దీనిని గమనించిన ప్రాజెక్టు అధికారులు దానికి సంబంధించిన గేటును మూసివేయడంతో ప్రమాదం తప్పింది. దీనిపై ప్రాజెక్టు ఎస్‌ఈ గౌరీపతి మాట్లాడుతూ రంధ్రం ఏర్పడిన పైపు స్థానంలో కొత్తది ఏర్పాటు చేస్తామని చెప్పారు.
     

మరిన్ని వార్తలు