అడ్డంకులపై ఆగ్రహజ్వాల

14 Feb, 2014 02:01 IST|Sakshi
అడ్డంకులపై ఆగ్రహజ్వాల
  •      ఎన్టీఆర్ విగ్రహం దహనం
  •      టీడీపీ ఆఫీస్‌పై గుడ్లతో దాడి
  •      జిల్లా వ్యాప్తంగా నిరసనలు
  •  వరంగల్, న్యూస్‌లైన్ : నోటికాడికొచ్చిన బుక్క లాక్కుంటున్నారంటూ తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి అనేక అడ్డంకులు సృష్టిస్తున్న సీమాంధ్ర నేతలపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరా లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా గురువారం సీమాంధ్ర ఎంపీలు కొందరు అడ్డుకుని నానా రభస చేయడాన్ని తెలంగాణవాదులు తీవ్రంగా నిరసిస్తున్నారు.

    తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎంపీలతోపాటు చంద్రబాబు వైఖరిని విమర్శిస్తున్నారు. నర్సంపేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. జనమంతా మేడారం జాతర హడావుడిలో ఉన్నప్పటికీ గురువారం నాటి పరిణామాలపై జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులు నిరసనలు వ్యక్తం చేశా రు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీజేఏసీ, ఎంఎస్ పీ, న్యాయవాదులు, విద్యార్థులు నిరసన తెలిపారు.

    జనగామ, మానుకోట, కేసముద్రం, నర్సంపేట, డోర్నకల్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో కాంగ్రె స్, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపా రు. ఎంపీ లగడపాటి, వేణుగోపాల్‌రెడ్డి, చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహిం చిన బీజేపీ జాతీయ నేతల తీరు రెండు నా ల్కల ధోరణిగా ఉందని విమర్శిస్తున్నారు.
     
    టీడీపీ కార్యాలయంపై న్యాయవాదుల దాడి
     
    హన్మకొండ హంటర్‌రోడ్డులోని టీడీపీ జిల్లా కార్యాలయంపై కోడిగుడ్లతో న్యాయవాదులు దాడిచేశారు. చంద్రబాబు నాయుడు తెలంగాణను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ తెలంగాణ న్యాయవాద జేఏసీ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా కోర్టుల్లో విధులు బహిష్కరించారు. హన్మకొండలోని కోర్టుల్లో విధులు బహిష్కరించిన న్యాయవాదులు చంద్రబాబు దిష్టిబొమ్మతో టీడీపీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. పార్టీ జెండాలను చింపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
     
    కేయూ మొదటి గేట్ వద్ద సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మలను పీడీఎస్‌యూ కేయూ కమిటీ, ఆప్ అనుబంధ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వేర్వేరుగా దహనం చేశారు. నర్సంపేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. కేసముద్రంలో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు కుట్రపన్నిన లగడపాటి, వే ణుగోపాల్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. చేర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టి సీమాంధ్ర ఎంపీ లగడపాటి దిష్టి బొమ్మ దహనం చేశారు. జేఏసీ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గిర్నిబావిలో లగపాటి దిష్టిబొవ్మును దహనం చేశారు. హసన్‌పర్తి, నెక్కొండలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మను దహనం చేశారు.
     

మరిన్ని వార్తలు