వడదెబ్బకు ఐదుగురి మృతి

23 May, 2014 02:26 IST|Sakshi

అనుమసముద్రంపేట, న్యూస్‌లైన్ : మండలంలోని పెద్దఅబ్బీపురం గ్రా మానికి చెందిన ఆలూరు లక్ష్మీనరస మ్మ (70) వడదెబ్బకు గురై బుధవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి కు మారుడు వెంకట సుబ్బయ్య కథనం మేరకు... బుధవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెకు స్థానికంగా వైద్యం సేవలందించారు. అర్ధరాత్రి దాటిన తరువాత మరోసారి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వైద్యశాలకు తరలించేం దుకు ప్రయత్నిస్తుండగా ప్రాణాలొదిలింది.
 
 జలదంకి: జలదంకిలో వడదెబ్బకు గురై అరవ సుబ్బారెడ్డి (80) గురువారం మృతి చెందాడు. సుబ్బారెడ్డిది చేజర్ల కాగా ఇటీవల జలదంకిలోని కుమార్తె ఇంటికి వచ్చాడు. స్థానిక పద్మావతి కల్యాణ మండపంలోని వివాహానికి వెళ్లి మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన గ్రామస్తులు మృతదేహాన్ని అతని కుమార్తె ఇంటికి తరలించారు. అనంతరం సుబ్బారెడ్డి మృతదేహాన్ని స్వగ్రామమైన చేజర్లకు తీసుకెళ్లారు.
 
 ఇందుకూరుపేట: గంగపట్నం గ్రామానికి చెందిన సోప్రాల రమణమ్మ(72) వడదెబ్బకు గురై బుధవారం రాత్రి మృతి చెందింది. అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులకు తట్టుకోలేక ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇది గమనించిన కుమారుడు బాబు వైద్య సేవలందించారు. అయినా ఫలితం లేక రమణమ్మ మృతి చెందింది.
 
 యాచకుడి మృతి
 పొదలకూరు : వేసవి తాపానికి తట్టుకోలేక వడదెబ్బకు గురై గుర్తు తెలియని యాచకుడు(45) గురువారం పొదలకూరులో మృతి చెందాడు. స్థానిక రామనగర్‌గేటు సెంటరులో భిక్షాటన చేసే వ్యక్తి అక్కడే బస్‌షెల్టర్‌లో తలదాచుకుంటాడు. ఈ క్రమంలో వేసవితాపానికి తాళలేక తుదిశ్వాస విడిచాడు. మృతుడి వివరాలు తెలియరాలేదు. ఎస్సై ఎం అంజిరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  
 
 వేటకెళ్లొచ్చి...
 చిల్లకూరు: మండలంలోని గుమ్మళ్లదిబ్బలో గురువారం సాయంత్రం స్థా నికుడు పోలంగారి శ్రీరాములు(47) వడదెబ్బకు గురై మృతిచెందాడు. చేపల వేటకు వెళ్లొచ్చిన శ్రీరాములు ఎండతీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

మరిన్ని వార్తలు