దుమ్ముగూడెంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి

23 Mar, 2015 03:13 IST|Sakshi
  • రాయలసీమ మహాసభ తీర్మానం
  •  కడప: దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును కేంద్రం తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాయలసీమ మహాసభ తీర్మానించింది.  కడప సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో సీమ జిల్లాలకు చెందిన రచయితలు, కళాకారులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాసభ కేంద్ర కమిటీ అధ్యక్షుడు శాంతి నారాయణ ప్రతిపాదించిన పలు తీర్మానాలను ఆమోదించారు. పోలవరం వల్ల ప్రయోజనం స్వల్పమేనన్నారు. దుమ్ముగూడెం వల్ల 160 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించడం ద్వారా ఆదా అయ్యే నీటిని శ్రీశైలం నుంచి సీమ ప్రాజెక్టులకు ఉపయోగించుకోవచ్చన్నారు.
     

మరిన్ని వార్తలు