సచివాలయంలో ఉద్యోగుల నిరసన ర్యాలీ

9 Feb, 2018 15:31 IST|Sakshi
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ

అమరావతి : సచివాలయంలో శుక్రవారం ఉద్యోగుల నిరసన ర్యాలీకి దిగారు. ఏపీకి స్పెషల్‌ కేటగిరీ స్టేటస్‌ ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలంటూ మూడో బ్లాక్ వద్ద ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ మాట్లాడుతూ.. అన్యాయంగా ఏపీని విభజన చేశారని మండిపడ్డారు. విభజన హామీలకోసం పార్లమెంటులో ఎంపీలు పోరాడుతున్నారని, హామీలు నెరవేర్చకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు