గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత.. దండెం రాంరెడ్డి, అనుచరులు హంగామా

2 Nov, 2023 13:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ నేత దండెం రాంరెడ్డి, అనుచరులు హంగామా సృష్టించారు. గాంధీభవనలో కుర్చీలు ఎత్తేస్తూ, రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలను రాంరెడ్డి అనుచరులు తగులపెట్టారు. ఇప్పటికైనా మల్‌రెడ్డి రంగారెడ్డిని మార్చి తనకు టికెట్‌ కేటాయించాలని దండెం రాంరెడ్డి డిమాండ్‌ చేశారు. యూత్‌ కాంగ్రెస్‌ నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేశానని, పార్టీ అప్పగించిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేశానని ఉద్ఘాటించారు.

ఇబ్రహీంపట్నంకు మల్‌రెడ్డి రంగారెడ్డి అభ్యర్థిత్వాలను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానానికి మొత్తం ఏడుగురు నేతలు పోటీపడగా.. వీరిలో మల్‌రెడ్డి రంగారెడ్డి, దండెం రాంరెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపించాయి. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం మల్‌రెడ్డి రంగారెడ్డి వైపే మొగ్గు చూపడంతో అసంతృప్తితో రగిలిపోతున్న  దండెం రాంరెడ్డి.. తన అనుచరులతో కలిసి గురువారం గాంధీభవన్‌ వద్ద హల్‌చల్‌ చేశారు.

మరిన్ని వార్తలు