పనులు చేసినా పైసల్లేవ్‌..!

18 Aug, 2018 12:24 IST|Sakshi
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

కడప సిటీ: ఉపాధి కూలీలకు ఆరువారాలుగా కూలి డబ్బులు అందలేదు. పనులు చేసినా పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈవిషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని డబ్బులు అందేలా చూడాలని కోరుతున్నారు. జిల్లాలో ఉపాధి హామీ కింద రోజుకు 1.7 లక్షల పనిదినాలు నమోదవుతున్నాయి.795 గ్రామ పంచాయితీల్లో పనులు జరుగుతున్నాయి.రోజుకు సగటున రూ.170–205వరకు కూలి ఇవ్వాలి. అయితే పని చేసినా సకాలంలో డబ్బులు అందక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 
4,88,939 మందికి..రూ.40.88 కోట్లు పెండింగ్‌ జిల్లాలో దాదాపు 4,88,939 మంది కూలీలకు రూ.40.88 కోట్లు రావాల్సి ఉంది. అంటే సగటున ఒక్కొక్కరికి  రూ.8,000 రావాల్సి ఉంది. రెజెక్ట్‌ అయిన ఖాతాలకు సంబంధించి 10,914 మంది కూలీలకు గాను రూ.97.61 లక్షలు రావాల్సి ఉంది. వివిధ కారణాలతో ఖాతాల్లో డబ్బులు జమ కాని కూలీలు 13,079 మందికి 2.21 లక్షలు రావాల్సి ఉంది.ఈ పరిస్థితుల్లో కూలీలు ఉపాధి పనులకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. కూలీలకు సకాలంలో డబ్బులు రాకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీంతో కూలీలు మండి పడుతున్నారు.

ఇబ్బందులు లేకుండా చూస్తాం
కూలీలకు సకా లంలో డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటాం.జూలై నెలకు సం బంధించి కొన్ని రోజుల వేతనం అందలేదని తెలిసింది.సమావేశం నిర్వహించి తగిన కారణాలను తెలుసుకుంటాం. కూలీలకు న్యాయం జరిగేలా చూస్తాం.  – వై.హరిహరనాథ్, డ్వామా, పీడీ

మరిన్ని వార్తలు