పత్తి ధర పెంచాలని రాస్తారోకో

8 Dec, 2013 00:40 IST|Sakshi

 సారంగాపూర్, న్యూస్‌లైన్ : ప త్తి ధర పెంచాలని డిమాండ్ చే స్తూ శని వారం టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులు స్థానిక పాతబ స్టాండ్ వద్ద నిర్మల్-స్వర్ణ రహదారిపై ఆందోళనకు దిగారు. మూడు గంటలపాటు రా స్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు, టీఆర్‌ఎస్ మండల అ ద్యక్షుడు సామల వీరయ్య మా ట్లాడుతూ శుక్రవారం పత్తికి రూ.4,550 ధర చెల్లించిన వ్యాపారులు ఒక్కసారిగా 150 తగ్గించడం దారుణమని అన్నారు. మార్కెట్‌యార్డులో వేలంపాట ద్వారా ధర నిర్ణయించే వ్యాపారులు కుమ్మక్కై రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ఆదిలాబాద్‌లో క్వింటాల్‌కు రూ.4,450, భైంసాలో రూ.4,500 ధర ఉండగా ఇక్కడి వ్యాపారులు రూ.4,550 నిర్ణయించి కొనుగోలు చేశారని తెలిపారు. శనివారం పత్తి బండ్లు అధిక సంఖ్యలో రాగానే ధర తగ్గించారని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ దశరథ రాజేశ్వర్, ఏఎస్సై భూమన్న, స్వర్ణ ప్రాజెక్టు చైర్మన్ ఓలాత్రి నారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి శంకర్ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
 
  రైతులు వినకపోవడంతో ప్రైవేటు వ్యాపారులను పిలిపిం చారు. అందరూ కలిసి మార్కెట్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రైవేటు వ్యాపారి కేదారినాథ్ పత్తికి క్వింటాల్‌కు రూ.50 పెంచుతామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు బొల్లోజి నర్సయ్య, నేరడిగొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు