అన్నదాత పరిస్థితి అగమ్యగోచరం

27 Apr, 2018 07:08 IST|Sakshi

కృష్ణా జిల్లా :  ‘సీఎం చంద్రబాబు  రైతులను అన్నివిధాలుగా మోసం చేశారు. రైతులను నట్టేట ముంచారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఏ పంట వేసినా నష్టాలే’ అంటూ రైతులు సుబ్రహ్మణ్యేశ్వరరావు, శివశంకర్, సాంబశివరావు, భాగ్యారావులు జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగన్‌ను కలసి పట్టిసీమ ద్వారా కృష్ణా జిల్లాకు చుక్క  నీరు కూడ రాలేదని వాపోయారు. చేసేది లేక  బోరు నీటి ద్వారానే పంటలను పండించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. రాజన్న హయాంలో రైతులు ఆనందంగా జీవించారని, ప్రస్తుతం అన్నదాత పరిస్థితి అమగ్యగోచరంగా      ఉందన్నారు. మినుమును ప్రస్తుతం రూ.4000 లకు    కొనుగోలు చేస్తున్నారని, కనీసం రూ.10 వేలు ధర   కల్పించాలన్నారు. వరికి రూ.1540 మద్దతు ధర           ప్రకటించారని, కనీసం రూ.2 వేలు ఇప్పిస్తే రైతులు నష్టాల నుంచి బయట పడతారని వివరించారు.  మార్క్‌ఫెడ్‌ల ద్వారా అధికారులు  రైతుల నుంచి పంటలు కొనుగోలు చేసిన నెల రోజులకు బ్యాంకులో డబ్బులు వేస్తున్నారని, పరిస్థిలో మార్పు తేవాలని కోరారు.

మరిన్ని వార్తలు