ఫైరింగా.. మిస్‌ ఫైరా!

4 Sep, 2017 22:59 IST|Sakshi
ఫైరింగా.. మిస్‌ ఫైరా!

ఏఎస్పీ కారు డ్రైవర్‌ రమేష్‌ మృతిపై అనుమానాలు
ఏకే47 మిస్‌ ఫైర్‌ అయ్యే అవకాశం చాలా తక్కువ
►  రమేష్‌ ఫోన్‌ నుంచి కృష్ణసింగ్‌తో ఉన్నతాధికారి మాట్లాడినట్లు ఆరోపణలు
►  కీలకంగా మారిన ఎస్పీ కార్యాలయం సీసీ కెమెరాల ఫుటేజ్‌
ప్రమాదవశాత్తు జరిగిన ఘటనేనన్న ఎస్పీ రామకృష్ణ


ఏకే47 మిస్‌ఫైరింగ్‌ వ్యవహారం క్రికెట్‌ బెట్టింగ్‌ కేసుకు చుట్టుకుంది. ఏఎస్పీ గన్‌మన్‌ చేసిన మిస్‌ఫైర్‌లో కారు డ్రైవర్‌ మరణించాడు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన లేక ఇతర వ్యవహారాల నేపథ్యంలో చేశారా అనేది పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏకే47 మిస్‌ఫైర్‌ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తుపాకి ఎప్పుడూ లాక్‌మోడ్‌లో ఉంటుంది. ఎందుకు మిస్‌ఫైర్‌ అయింది.. లేక కావాలనే ఫైర్‌ చేశారా అనే విషయంపై పోలీసు విచారణ మొదలైంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  ఏఎస్పీ శరత్‌బాబు గన్‌మన్‌ కె.నాగేంద్ర చేసిన మిస్‌ఫైర్‌లో కారు డ్రైవర్‌ రమేష్‌(32) మృతిచెందాడు. రెండు బుల్లెట్లు వేగంగా తగిలి నిమిషాల వ్యవధిలోనే రమేష్‌ చికిత్స పొందుతూ మృతిచెందాడు. 2009 బ్యాచ్‌కు చెందిన రమేష్‌ ఐదేళ్లగా ఏఎస్పీ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర నుంచి శరత్‌బాబు వద్ద డ్రైవర్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఏఎస్పీ సినిమాకు వెళ్లి ఎస్పీ కార్యాలయం నుంచి ఫోన్‌ రావడంతో రాత్రి 9.30 గంటల సమయంలో అక్కడికి వెళ్లారు.

గన్‌మన్‌ కారు దిగి డోర్‌ తీస్తున్న క్రమంలో గన్‌ మిస్‌ఫైర్‌ అయి డ్రైవర్‌కు బుల్లెట్‌ గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే సమీపంలోని కిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కొద్ది నిమిషాలకే రమేష్‌ మరణించాడు. రమేష్‌ తండ్రి వెంకటేశ్వర్లు, స్నేహితురాలు అనసూయ ఆది వా రం మీడియాతో మా ట్లాడుతూ ఇది ప్రమాదవశాత్తు జరి గిన ఘటన కాదని, హత్యేనని ఆరోపించారు. రమేష్‌ను కొద్ది రోజు ల క్రితం బెట్టింగ్‌ వ్య వహారంలో ఫోన్‌ కాల్‌లిస్ట్‌ ఆధారంగా పోలీ సులు విచారించారని, ఈ పరిణామాల క్ర మంలోనే మృతిచెం దాడని ఆరోపించడంతో అనుమానాలు మ రింత బలపడ్డాయి.

మిస్‌ ఫైర్‌ ఎలా అవుతుంది!
సాధారణంగా గన్‌మె న్‌ల వద్ద ఉండే ఏకే 47లో 30 బుల్లెట్లు లోడ్‌ చేసి ఉంటాయి. అత్యవసర సందర్భాల్లో మినహా 24 గం టలు గన్‌ను ధరించే గన్‌మెన్‌లు లాక్‌మోడ్‌లో దాన్ని ఉంచుతారు. వీటితోపాటు ఏకే 47 మిస్‌ఫైర్‌ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. శనివారం రాత్రి మిస్‌ఫైర్‌ అయ్యేందుకు ముందు గన్‌ అన్‌లాక్‌ మోడ్‌లో ఎందుకు ఉంది. అలాగే అత్యవసర సమయాల్లో మినహా ట్రిగ్గర్‌ మీద వేలు ఉంచరు. కానీ మిస్‌ ఫైర్‌  సమయంలో అన్‌లాక్‌ మోడ్‌తోపాటు ట్రిగ్గర్‌పైన వేలు ఎందుకు ఉంచా రు. అలాగే ఎక్కువ కాలం లాక్‌మోడ్‌లో ఉన్న గన్‌ను అన్‌లాక్‌ చేయడం కూడా కొంత కష్టంగా ఉంటుంది.

ఏకే 47లో మూడు రకాల పార్టిషన్లు ఉంటాయి. సేఫ్‌ మోడ్‌లో ఎప్పుడూ గన్‌ ఉం టుంది. అలాగే ర్యాపిడ్‌ మోడ్‌లో ఉంచితే ఒక్కసారి ట్రిగ్గర్‌ నొక్కితే ఒక్క బుల్లెట్‌ మాత్రమే వచ్చేలా డిజైన్‌ చేశారు. ఆటో మోడ్‌లో ఒక్కసారి ట్రిగ్గర్‌ నొక్కితే రెండు బుల్లెట్లు, తర్వాత ట్రిగ్గర్‌ నొక్కితే 28 బుల్లెట్లు ఏకకాలంలో బయటకు వస్తాయి. కూంబింగ్‌ ఆపరేషన్, ప్రత్యర్థుల దాడి సమయంలో మాత్రమే ఆటోమోడ్‌ వినియోగిస్తుంటారు. శనివారం జరిగిన ప్రమాద సమయంలో గన్‌ ఆటోమోడ్‌లో ఉంది. రెండోసారి ట్రిగ్గర్‌ నొక్కి తే ఎస్పీ కార్యాలయంలో పెను ప్రమాదమే జరిగేది. వెనుక సీ ట్లో ఏఎస్పీ, సమీపంలో 10 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు.

బెట్టింగ్‌ కేసుతో ముడి
ఇదిలా ఉంటే రమేష్‌ ఫోన్‌ నుంచి కృష్ణసింగ్‌తో ఓ ఉన్నతాధి కారి మాట్లాడినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. వాస్తవానికి కృష్ణసింగ్‌ సదరు ఉన్నతాధికారికి ఫోన్‌ చేస్తే ఆయన ఫోన్‌కు స్పందించని కారణంగా రమేష్‌ ఫోన్‌కు చేసినట్లు ఆరోపణ లున్నాయి. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో 20 కాల్స్‌ కృష్ణసింగ్‌ నంబర్‌ నుంచి రమేష్‌ మొబైల్‌కు వచ్చాయి. దీనిపై 15 రోజుల క్రితం రమేష్‌ను పోలీసు అధికారులు విచారించినట్లు ఆరోపణలు న్నాయి. దీన్ని రమేష్‌ కుటుంబ సభ్యులకు తెలిపి బాధపడినట్లు సమాచారం. ఇలాంటి తరుణంలోనే రమేష్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉన్నతాధికారులు కేసు నుంచి బయటపడడానికి ఈ విధంగా వ్యవహరించారా లేక ప్రమాదవశాత్తే ఘటన జరిగిందా అనేది పోలీసుల్లో చర్చసాగుతోంది.

పోలీసు అధికారులు ఏమంటున్నారంటే
ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనేనని పోలీసు అధికారుల వాదన. ఒక వేళ గన్‌మన్‌కు వేరే ఉద్దేశం ఉంటే ఎస్పీ కార్యాలయంలో ఈ తరహా పని చేయడు. సంఘటన స్థలంలో సుమారు 15 మంది వరకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అలాగే ఎస్పీ కా ర్యాలయంలో సీసీ కెమెరాల నిఘా కూడా ఉంది. దీంతోపాటు ఉద్దేశపూర్వకంగా కాలిస్తే బుల్లెట్లు నేరుగా చొచ్చుకుపోతాయి. రమేష్‌ దేహంలో మాత్రం ఒక పక్క, చేతికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. ఎస్పీ రామకృష్ణ సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ ఈ ఘటనపై కేసు నమోదుచేసి అన్ని కోణాల్లో విచారిస్తామని చెప్పారు. ప్రాథమికంగా ఉన్న ఆధారాల మేరకు ప్రమాదవశాత్తు జరిగిన ఘటనేనని ఎస్పీ తెలిపారు.

మరిన్ని వార్తలు